Big Stories

Ponniyin Selvan 2 Review : విజువల్ వండర్.. పొన్నియిన్ సెల్వన్ 2 .. ప్రేక్షకులను మెప్పించిందా..?

- Advertisement -

Ponniyin Selvan 2 Review: పొన్నియిన్ సెల్వన్ -1 తమిళనాడులో సూపర్ హిట్ కొట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో విడులైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ , త్రిష లాంటి స్టార్లు ఈ మూవీలో నటించారు. ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఈ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. ప్రముఖ తమిళ రచయత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ మూవీని మణిరత్నం తెరకెక్కించారు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్- 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది.

- Advertisement -

వల్లవరాయ వందియ దేవుడు అంటే కార్తి, పొన్నియిన్ సెల్వన్ అంటే జయం రవి.. చోళనాడుకు నౌకపై వెళ్తుండగా వారిపై దాడి జరుగుతుంది. వారు నీటిలో మునిగిపోవడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. రెండో పార్ట్ ఆదిత్య కరికాలుడు అంటే విక్రమ్, నందిని అంటే ఐశ్వర్య రాయ్ చిన్ననాటి ప్రేమకథతో మొదలవుతుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్ తర్వాత నీటిలో మునిగిపోయిన కార్తి, జయం రవిని పూంగుళి అంటే ఐశ్వర్య లక్ష్మి కాపాడుతుంది. మరోవైపు విక్రమ్, కుందవై అంటే త్రిష, జయం రవిని ఒకేసారి చంపడానికి ఐశ్వర్యరాయ్.. పాండ్యులతో కలిసి పథకం వేస్తుంది. మరి ఆ పథకం ఫలించిందా? చోళనాడుకు ఎవరు రాజు అయ్యారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పొన్నియిన్ సెల్వన్ -1 పెద్ద హిట్. కానీ ఆ మూవీ ప్రేక్షకులకు నచ్చినా కథ పూర్తిగా అర్థంకాలేదు. దీంతో పార్ట్-2 పై ఆసక్తి పెరిగింది. సెకండ్ పార్ట్ లో మొదటి సన్నివేశం నుంచే కథలోకి తీసుకెళ్లారు దర్శకుడు మణిరత్నం. విక్రమ్ , ఐశ్వర్యరాయ్ చిన్ననాటి ప్రేమ కథ బాగా సాగింది. జయం రవి చనిపోయాడని అతని కుటుంబం పడే బాధ, ఇదే అదనుగా రాజ్యం కోసం శత్రువులు పన్నే పన్నాగాలు, మరోవైపు శ్రీలంకలో కార్తి, జయం రవి తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల మధ్య ఫస్టాఫ్ చాలా వేగంగా సాగుతుంది.

కానీ సెకండాఫ్ లో కీలక పాత్రల మధ్య డ్రామా పండించడానికి మణిరత్నం ప్రయత్నించారు. ఆ డ్రామా కొంత సాగదీతలా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో విక్రమ్, ఐశ్వర్య రాయ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. అలాగే ఐశ్వర్య రాయ్ పాత్రకు సంబంధించిన ట్విస్టులు అదిరిపోయాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. రవివర్మన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది.

పొన్నియిన్ సెల్వన్ -2లో విక్రమ్, ఐశ్వర్యరాయ్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. త్రిష, కార్తిల మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. పొన్నియిన్ సెల్వన్ -1 కంటే పొన్నియిన్ సెల్వన్- 2 చాలా ఇంట్రెస్టింగ్ సాగిందనే చెప్పుకోవాలి. కోట‌లు, రాజ‌మందిరాల్లో తీర్చిదిద్దిన స‌న్నివేశాలు, యుద్ధ స‌న్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆక‌ట్టుకుంటాయి.

యాక్టర్స్ : విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష, శోభిత ధూళిపాల, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, ప్రభు, శరత్‌కుమార్‌, పార్తిబన్‌, రెహమాన్‌, విక్రమ్‌ ప్రభు
మ్యూజిక్ : ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ : రవి వర్మన్
ఎడిటింగ్‌ : ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాత : మణిరత్నం, శుభాష్‌ కరణ్‌
స్క్రీన్‌ప్లే : మణిరత్నం, బి.జయమోహన్‌, కుమర్‌వేల్‌
డైరెక్టర్ : మణిరత్నం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News