BigTV English
Advertisement

Case against ‘Indian 2’: కోర్టును ఆశ్రయించిన టీచర్.. ‘భారతీయుడు 2’ రిలీజ్ ఆగిపోనుందా..?

Case against ‘Indian 2’: కోర్టును ఆశ్రయించిన టీచర్.. ‘భారతీయుడు 2’ రిలీజ్ ఆగిపోనుందా..?

Case against Kamal haasan Indian 2: భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వాటికి భారీ స్పందన రావడంతో సినిమాపై మరింత అంచనాలను పెరిగాయి. అప్పట్లో వచ్చిన భారతీయుడు ఓ సెన్షేన్ క్రియేట్ చేసింది. ఇక భారతీయుడు 2 కూడా ఖచ్చితంగా సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.


అయితే, ఈ క్రమంలో భారతీయుడు 2 చిత్ర యూనిట్ కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా విషయమై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా రిలీజ్ ను ఆపాలంటూ విజ్ఞప్తి చేశాడు.

భారతీయుడు సినిమా కోసం హీరో కమల్ హాసన్‌కు వర్మకలై(కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్స్) లో శిక్షణ ఇచ్చినట్లు ఆసన్ రాజేంద్రన్ తెలిపిన విషం తెలిసిందే. ఈ విషయమై మధురైకు చెందిన మార్షల్ ఆర్ట్స్ టీచర్ రాజేంద్రన్ మధురై జిల్లా కోర్టును ఆశ్రయించాడు. భారతీయుడు 2 సినిమాలో వర్మకలైలో తన మెళకువలు ఉపయోగించేందుకు చిత్ర యూనిట్ తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పిటిషన్ వేశాడు. అందువల్ల సినిమా రిలీజ్‌ను ఆపండంటూ అందులో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. దీనిపై స్పందించాలంటూ చిత్ర బృందానికి మరింత సమయం ఇచ్చింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.


Also Read: సందీప్ కిషన్ “వివాహభోజనంబు” పై ఫుడ్ సేఫ్టీ అధికారుల రెయిడ్

ఇక భారతీయుడు 2 ఈ నెల 12న విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, అమితాబ్ బచ్చన్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్త తెలియడంతో అభిమానులు కొంత నిరాశపడుతున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×