BigTV English

Vivaha Bhojanambu : సందీప్ కిషన్ “వివాహభోజనంబు” పై ఫుడ్ సేఫ్టీ అధికారుల రెయిడ్

Vivaha Bhojanambu : సందీప్ కిషన్ “వివాహభోజనంబు” పై ఫుడ్ సేఫ్టీ అధికారుల రెయిడ్

Food Safety Officials Attack on Vivaha Bhojanambu : సినిమాల్లో నటిస్తూ.. సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సందీప్ కిషన్ కు రెస్టారెంట్ బిజినెస్ ఉందన్న విషయం తెలిసిందే. హీరో సందీప్‌కిషన్‌కు చెందిన “వివాహభోజనంబు” హోటల్‌ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రెయిడ్ చేశారు. అక్కడ గలీజ్ వాతావరణం ఉందని నోట్ చేసుకున్నారు. ఈ దాడుల్లో.. హాటల్ లో కాలం చెల్లిన సరుకులు, సింథటిక్ ఫుడ్ కలర్స్, సరిగ్గా లేబుల్ చేయని ఆహార పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు. కనీసం.. డస్ట్‌బిన్‌లపై మూతలు కూడా లేవన్నారు ఫుడ్‌సేఫ్టీ అధికారులు.


వంటగదిలో మురికి నీరు నిలిచిపోయిందని,పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని స్పష్టం చేశారు. 2022 వరకే వాడేందుకు ప్యాక్ చేసి ఉన్న 25 కేజీల చిట్టిముత్యాలు బియ్యం బ్యాగ్ తో పాటు అరకేజీ కొబ్బరి పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించారు. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వండిన ఆహారాలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి.. మళ్లీ వాటినే వేడి చేసి పెడుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. వంట చేసేందుకు వాడే నీరు కూడా మురికిగా ఉన్నట్లు తెలిపారు.

కిచెన్ లో ఆహారాలను తయారు చేసే వాళ్ల మెడికల్ రిపోర్టులు కూడా లేవని తెలిపారు. వంటకు ఉపయోగించిన సామాన్లను శుభ్రం చేయగా.. ఆ నీరు కూడా అక్కడే నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ఫుడ్ సేఫ్టీ అధికారులు X లో పోస్ట్ చేశారు. ఇటీవలే హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేయడం, కుళ్లిన ఆహారాన్ని అలాగే ఉంచడం, వంటి ఘటనలు వెలుగుచూశాయి. అవన్నీ చూసిన ఆహారప్రియులు.. రెస్టారెంట్లలో తినాలంటేనే జంకుతున్నారు.


Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×