E-Paper
Advertisement

Kalki 2898 AD: ఆ ఐకానిక్ షాట్ వెనుక ఉన్న హస్తం ఆ హీరోదే.. ?

Kalki 2898 AD: ఆ ఐకానిక్ షాట్ వెనుక ఉన్న హస్తం ఆ హీరోదే.. ?
Advertisement

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి విజయాన్ని అందుకోవడం నాలుగో సారి. బాహుబలి తరువాత అసలు సిసలైన విజయం అందుకొని మరోసారి తన సత్తాను చాటుకున్నాడు.

ఇక ఈ సినిమాలో అమితాబ్.. అశ్వత్థామగా కనిపించగా.. కాంప్లెక్స్ అధినేత సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ హాసన్ నటించాడు. మైథలాజికల్ కు సైన్స్ ఫిక్షన్ ను జోడించి నాగీ ఈ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు.ఇప్పటివరకు ఈ సినిమా రూ. 900 కోట్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. సినిమా మొత్తం ఐకానిక్ షాట్స్ తో నిండిపోయాయి అంటే అతిశయోక్తి కాదు.

Advertisement

ఇక సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్ లో కమల్ నటన మరో ఎత్తు. ఎవరు ముట్టుకోలేని అర్జునుడు విల్లును సుప్రీమ్ యాస్కిన్ ఎత్తి.. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి.. వస్తున్నాయి.. రథ చక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను అంటూ డైలాగ్ చెప్పడంతో సినిమా ముగుస్తుంది. ఈ ఐకానిక్ షాట్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ను తెప్పించింది.

ఇక ఈ ఐకానిక్ షాట్ ఐడియా నాగ్ అశ్విన్ ది కాదట. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ తెలిపాడు. ఈ ఐకానిక్ షాట్ వెనుక ఉన్న హస్తం లోకనాయకుడు కమల్ హాసన్ దే అంట. ఇలా చేస్తే బావుంటుంది అని ఆయన చెప్పడంతోనే ఆ షాట్ పెట్టినట్లు నాగీ చెప్పుకొచ్చాడు. అదే సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎంతైనా కమల్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×