
Ahimsa Telugu Movie Review(Latest Tollywood Movie Updates): దగ్గుబాటి వారసుడు. తేజ దర్శకుడు. తొలి పరిచయంగా అభిరామ్‌కు ఎంతో ప్రత్యేకమైన సినిమా. తేజకు ప్రతీ సినిమా ప్రత్యేకమే. వారి కాంబినేషన్‌లో ‘అహింస’ అనగానే ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ చూసి ‘జయం’లానే ఉంటుందని అనుకున్నారు. కొత్త నటులను పరిచయం చేయడంలోను.. లవ్, యాక్షన్ తరహా సినిమాలు తీయడంలోనూ తేజ ఎక్స్‌పర్ట్. అందుకే, బ్రదర్ ఆఫ్ రానాని ఎలా చూపించారు? అభిరామ్ ఫస్ట్ ఫిల్మ్ ఎలా ఉంది? తేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడా? అలానే తీశాడా? ఇలా అహింస రిలీజ్‌తో పాటే రివ్యూపైనా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే….
స్టోరీ: రఘు (అభిరామ్ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ) బావామరదళ్లు. వాళ్లిద్దరి మధ్య లవ్. ఎంగేజ్‌మెంట్ కూడా అవుతుంది. అదేరోజు అహల్యను రేప్ చేస్తారు. పవర్‌ఫుల్ పర్సన్ ధనలక్ష్మి దుష్యంతరావు (రజత్ బేడి) కొడుకులు ఆ అఘాయిత్యానికి ఒడిగడతారు. వారిపై కోర్టుకు వెళతాడు రఘు. లాయర్ లక్ష్మి (సదా) రఘుకు సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? ఆ దుర్మార్గులపై రఘు ఎలా పోరాడాడనేది మిగతా స్టోరీ.
అనుకున్నట్టుగానే ఇది జయం-2. బలవంతుడిపై బలహీనుడు చేసే పోరాటం. పేరైతే అహింస అని పెట్టారు కానీ, ట్రైలర్లో చూపించినట్టే సినిమా మొత్తం ఛేజింగ్‌లు, ఫైటింగ్‌లతో హింస హింస నడుస్తుంది. సెకండాఫ్, క్లైమాక్స్‌లో కొన్ని సీన్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్‌లో తేజ మార్క్ లవ్ ట్రాక్ ఓకే అనిపిస్తుంది. అయితే, కథలో పెద్దగా ట్విస్టులు గట్రా ఉండవు. ఎక్కడా టెన్షన్ క్రియేట్ అవదు. అడవుల్లో ఫైటింగ్స్, కృష్ణతత్వంపై డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
నటనలో అభిరామ్ మెప్పించలేకపోయాడు. యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. లాయర్ లక్ష్మీగా సదా క్యారెక్టర్ ఫర్వాలేదనిపిస్తుంది. సాంకేతికంగా బానే తీశారు. ఎడిటింగ్ మైనస్. ఎప్పటిలానే డైరెక్టర్ తేజ.. తన పాత సినిమాలను మళ్లీ తానే కాపీ కొట్టాడని అనిపించక మానదు. స్టోరీ లైన్ బానేఉన్నా.. కథనమే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండాల్సింది.
“అహింస నచ్చనివాళ్లకు హింసే”