Big Stories

BRS: తెలంగాణ భవన్‌లో శేజల్ సూసైడ్ అటెంప్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలుంటాయా?

sejal

BRS: అధికారంలో ఉన్నోడు మనోడైతే ఎలాంటి అరాచకాలైనా మాఫీ అయిపోతాయా? సామాన్యుడు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తేనే.. పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తున్నారే.. అలాంటిది ఓ సామాన్యురాలు ఆ ఎమ్మెల్యేపై సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేస్తే.. కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా ఈ ఖాకీలు? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మానసికంగా , లైంగికంగా వేధిస్తున్నాడని.. ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయినా, ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే, ఢిల్లీ వెళ్లి జాతీయ మహిళా కమిషన్‌, హెచ్‌ఆర్సీని కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -

నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న శేజల్.. ఇక తనకు న్యాయం జరగదేమోననే ఆవేదనతో మనస్తాపం చెందారు. హస్తినలోని తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను చూసిన తెలంగాణ భవన్ సిబ్బంది.. వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

- Advertisement -

శేజల్ ఆత్మహత్యాయత్నం తర్వాతనైనా.. బెల్లంపల్లి పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటారా? ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగి.. ఆమె ప్రాణాలతో, జీవితంతో చెలగాటమాడుతారా? శేజల్‌కు ఇకముందైనా న్యాయం జరుగుతుందా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News