Aishwarya Rai:సాధారణంగా ఇండస్ట్రీలోనే కాదు ఆడవారు ఎక్కడైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఒంటరిగా వెళ్లినా.. గుంపుగా వెళ్ళినా సరే అమ్మాయిలకు మాత్రం రక్షణ లేదనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.. వీధిలో వెళ్తుంటే మహిళలపై కామెంట్లు చేసే వాళ్ళు మరీ ఎక్కువ అయ్యారు. వెకిలి వేషాలు, కొంటె చూపుల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ తరహా వేధింపులను ఎలా ఎదుర్కోవాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) కొన్ని టిప్స్ చెబుతూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మహిళలు స్వీయ విలువల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి..
ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ..”సినిమా ఇండస్ట్రీలోనే కాదు బహిరంగ ప్రదేశాలలో కూడా ఆడవారికి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పడం లేదు. కాబట్టి ఆడవారు వీధిలో వేధింపులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు వదిలేసి పారిపోకండి.. కంటి చూపును ఎటో తిప్పేయకూడదు.. నేరుగా సమస్యను కళ్ళల్లోకే చూడాలి. తలెత్తుకొని తిరగాలి.. స్త్రీ.. స్త్రీ వాదం అవసరం.. నా శరీరం నా విలువ అనేది తెలుసుకొని, ఎప్పుడు ఎక్కడ రాజీ పడకుండా.. మీ విలువ విషయంలో మిమ్మల్ని మీరు అవమానించకుండా ముందడుగు వేస్తే, మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు” అంటూ తెలిపింది ఐశ్వర్యరాయ్.
మహిళలలో ఆత్మస్థైర్యం నింపిన ఐశ్వర్యరాయ్..
ఇకపోతే మహిళలపై హింస నిర్మూలన కోసం ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వీధులలో అమ్మాయిలు ఎదుర్కొనే వేధింపులను ఎలా ఎదుర్కోవాలో.. తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇచ్చి, ఎంతో మంది అమ్మాయిలకు ధైర్యాన్ని నింపింది ఐశ్వర్యరాయ్. మనమంతా మన విలువను గుర్తించాలని కూడా మహిళలకు సూచించింది. ఇక ఐశ్వర్యరాయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఐశ్వర్య చెప్పిన విషయాలు చాలా కచ్చితంగా ఉన్నాయని, ప్రతి ఒక్క అమ్మాయి కూడా తన విలువలను తెలుసుకొని ముందడుగు వేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.
ఐశ్వర్యరాయ్ కెరియర్..
ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే.. 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. తన అందంతోనే కాదు తెలివితేటలతో కూడా మెప్పించి అలరించింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్న తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు తలుపు తట్టాయి. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించిన ఈమె ప్యారిస్ ఫ్యాషన్ వీక్, గేమ్స్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా మెరిసింది. ఇప్పటికీ ఈ వేడుకలకు హాజరవుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ను మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్:1,2 లో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలుపెట్టింది. అంతే కాదు ఈ చిత్రానికి సైమా లో ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే ఐశ్వర్యారాయ్ తన కెరియర్ విషయంలో రాజీ పడకుండా నచ్చిన పాత్రను చేసుకుంటూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.