Aishwarya Rajesh..ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh).. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్, ఈశ్వరీ రావ్ కీలక పాత్రలో వచ్చిన ‘రాంబంటు’ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఎవరో కాదు ప్రముఖ నటి నాగమణి (Nagamani) ప్రముఖ హీరో రాజేష్(Rajesh) దంపతుల కుమార్తె. ఈమె మేనత్త శ్రీలక్ష్మి (Srilakshmi). టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో.. ఈమె తల్లి నలుగురు పిల్లల బాధ్యతను తీసుకొని, అన్నీ తానై వీరిని ముందుకు నడిపించింది. ఇక తల్లి కష్టాలను చూసిన ఐశ్వర్య రాజేష్ చిన్నతనంలోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ.. తల్లికి అండగా నిలిచింది. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. వాస్తవానికి తెలుగు హీరోయిన్ అయినా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ లోనే నటిగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్. తెలుగులో మళ్లీ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) లీడ్రోల్ పోషించిన’ కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో ఆయన కూతురుగా నటించి మెప్పించింది. ఆ తర్వాత ‘రిపబ్లిక్’, ‘టక్ జగదీష్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలలో నటించింది. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh ) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా అందించిన క్రేజ్ తో ప్రస్తుతం పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అందులో భాగంగానే తన రిలేషన్షిప్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మళ్ళీ ప్రేమంటే భయమేస్తోందంటూ తెలిపింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రిలేషన్ షిప్ లో నరకం చూసాను..
ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ..” ప్రేమ కంటే కూడా అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటేనే నాకు ఎంతో భయం. నేను ఎంతో ఎమోషనల్. ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికి నాకు చాలా సమయం పడుతుంది. గతంలో కూడా నేను రిలేషన్ లో ఉన్నాను. సినిమాలోకి అడుగుపెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను. కానీ అతడు నన్ను వేధింపులకు గురి చేశాడు.నరకం చూపించాడు. దానికంటే ముందు కూడా అలాంటి ప్రేమనే నేను చూశాను. అయితే రిలేషన్షిప్ లో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని భయపడుతున్నాను. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నాను. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటేనే మళ్లీ భయం వేస్తోంది అందుకే రిలేషన్షిప్ కి నేను దూరంగా ఉంటాను” అంటూ తెలిపింది.
మా అమ్మే నాకు స్ఫూర్తి..
అలాగే తన తల్లి ప్రముఖ నటి నాగమణి గురించి మాట్లాడుతూ.. “నాకు స్ఫూర్తి మా అమ్మే.. మా తల్లిదండ్రులకు మేము మొత్తం నలుగురు సంతానము. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అమ్మ ఎంతో కష్టపడింది.ఇక అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే నేను ముందడుగు వేశాను. ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారాను. నాకు నచ్చిన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం అమ్మను నేను చూసుకుంటున్నాను. అదే నాకు చాలా గర్వంగా ఉంటుంది” అంటూ ఐశ్వర్య తెలిపింది.