Ajith Kumar: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith) ఈమధ్య ఎక్కువగా కార్ రేసింగ్ లలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆయన ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు తనకు ఇష్టమైన బైక్, కార్ రేసింగ్ లలో పాల్గొంటూ సత్తా చాటుతున్నారు.. అయితే అలా కారు రేసింగ్ లో పాల్గొంటున్నారో లేదో ఇలా వరుసగా ప్రమాదాలు బారిన పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే మొన్న దుబాయ్..నిన్న పోర్చుగల్.. ఇప్పుడు స్పెయిన్ లోని వాలెన్సీయాలో జరిగిన కార్ రేసింగ్ లో పాల్గొన్న అజిత్.. వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. స్పెయిన్ లోని వాలెన్సియాలో జరుగుతున్న పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ రేస్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు.
గాల్లో రెండు పల్టీలు కొట్టిన అజిత్ కార్..
రేస్ లో భాగంగా తన ముందు వెళ్తున్న కారుని ఢీ కొట్టిన అజిత్ కారు ఏకంగా గాల్లోకి రెండు పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో హీరో అజిత్ కి ఎటువంటి గాయాలు కాకపోవడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం అజిత్ కార్ యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొదట ఇది చూసిన అభిమానులు కంగారు పడ్డా.. ఆ తర్వాత అజిత్ క్షేమంగా కారు నుంచి బయటకు వచ్చిన వీడియో కూడా వైరల్ గా మారింది. అటు హీరోకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ కాస్త మనసును స్థిమితం చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ నెలలో అజిత్ కారు ప్రమాదానికి గురవడం ఇది రెండవసారి కావడం గమనార్హం. దీంతో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని తమ అభిమాన హీరోకి సూచిస్తున్నారు.
ALSO READ: Rakul Preet Singh: రకుల్ కి పెళ్లి కలిసి రావడం లేదా..?
యాక్సిడెంట్.. ఇదేం మొదటిసారి కాదు..
ఇకపోతే అజిత్ ప్రమాదానికి గురవడం ఇదే మొదటిసారి కాదు అని చెప్పాలి. గత కొన్ని రోజుల క్రితం పోర్చుగల్ లో జరిగిన కార్ రేసింగ్ లో కూడా ఆయన కారు ప్రమాదానికి గురైంది. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అనుకోకుండా కారు యాక్సిడెంట్ అయింది. రేస్ ప్రారంభం కాకమునుపే ప్రాక్టీస్ లో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతోనే యాక్సిడెంట్ అయిందని నిపుణులు తెలియజేశారు. అయితే అదృష్టవశాత్తు అజిత్ కి ఆక్సిడెంట్ లో ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి ఆ తర్వాత మళ్లీ అజిత్ పాల్గొన్నారు. ఇక్కడ ఏకంగా మూడవ స్థానాన్ని దక్కించుకొని శభాష్ అనిపించారు.అలాగే అంతకుముందు దుబాయిలో జరిగిన రేసింగ్ ఈవెంట్ లో కూడా అజిత్ కారుకు యాక్సిడెంట్ అవ్వడం గమనార్హం..ఇది చూసిన అభిమానులు మీరు పాల్గొన్న ప్రతిసారి రేస్ లో ఆక్సిడెంట్ కి గురవుతున్నారు. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన ఇష్టమైన కారు రేస్ లో ఇలా వరుసగా ప్రమాదానికి గురవుతుండడంతో అభిమానులు కలవరపాటుకు గురి అవుతున్నారు.