IND VS PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో ఐదు మ్యాచ్లు పూర్తి కాగా.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో…. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఏ జట్టు గెలుస్తుంది అనే దానిపైన బెట్టింగ్ కూడా చేస్తున్నారు. దీంతో… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ ను తలపిస్తోంది. భారత కాలమానం ప్రకారం… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read: IND VS PAK: ఇండియాకు సర్ ప్రైజ్ ఇస్తామన్న పాక్ కోచ్.. బాంబులేస్తారా అంటూ ట్రోలింగ్?
ఈ బిగ్ ఫైట్ ను మనం జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 చానల్స్ చూడవచ్చు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో తుది జట్టులో ఏ ప్లేయర్ ఉంటాడు అనే దానిపైన… కొత్త చర్చ జరుగుతోంది. అయితే పాకిస్తాన్ దెబ్బకొట్టేందుకు… మిస్టరీ ప్లేయర్ తో బరిలోకి దిగేందుకు టీమిండియా ప్లాన్ వేస్తోందట. ఆ మిస్టరీ ప్లేయర్ ఎవరో కాదు వరుణ్ చక్రవర్తి. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ గా పేరుగాంచిన.. వరుణ్ చక్రవర్తి… బౌలింగ్ లో ఇప్పటివరకు పాకిస్తాన్ పెద్దగా ఆడలేదు. కాబట్టి అతన్ని జట్టులోకి తీసుకుంటే…. పాకిస్తాన్ విలవిలలాడిపోవడం గ్యారంటీ అంటున్నారు. అయితే మిస్టరీస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులో ఉండాలంటే… కుల్దీప్ యాదవ్ పైన వేటు పడక తప్పదు. అందుకే అతని స్థానంలో వరుణ్ చక్రవర్తి వస్తాడని అంటున్నారు. అలాగే హర్షిత్ రానా పైన కూడా వేటుపడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హర్షిత రానా స్థానంలో అర్ష్ దీప్ సింగ్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహమ్మద్ షమితో పాటు అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ పంచుకొనున్నాడు.
మొదటి మ్యాచ్ లో మహమ్మద్ సమీ దుమ్ము లేపడంతో… ఇక పాకిస్తాన్ కు చుక్కలే అని అంటున్నారు. ఇక అటు విరాట్ కోహ్లీకి నిన్న ప్రాక్టీస్ సమయంలో.. గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే విరాట్ కోహ్లీ ఇవాల్టి మ్యాచ్కు దూరం అవుతాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ మ్యాచ్కు దూరమైతే టీమిండియా కు కష్టాలు తప్పవు. పాకిస్తాన్ పైన విరాట్ కోహ్లీ కి మంచి రికార్డులు ఉన్నాయి. కాబట్టి విరాట్ కోహ్లీ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఆడక పోతే పంత్ జట్టులో ఉండే ఛాన్సులు ఉన్నాయి.
Also Read: PCB on Indian Team: ఇండియా పై ఓడిపోతామని ముందే ప్రకటించేసిన PCB చైర్మన్?
పాకిస్తాన్ అంచనా వేసిన XI: బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (C & WK), సల్మాన్ అలీ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్/మహమ్మద్ హస్నైన్
భారత్ అంచనా వేసిన XI: రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్. షమీ