BigTV English

Vidaamuyarchi: పొంగళ్ రేస్ నుంచి తప్పుకున్న అజిత్ మూవీ.. ఏమైందంటే..?

Vidaamuyarchi: పొంగళ్ రేస్ నుంచి తప్పుకున్న అజిత్ మూవీ.. ఏమైందంటే..?

Vidaamuyarchi: సాధారణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే తెలుగు హీరోలు మాత్రమే కాకుండా కోలీవుడ్ హీరోలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే తమ సినిమాలను పొంగల్ కి తీసుకురావాలని ఆలోచిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల మధ్య తెలుగు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని, తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు అజిత్. కానీ ఆశలు కాస్త అడియాశలు అయ్యాయని చెప్పవచ్చని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అజిత్ నటించిన విడాముయార్చి సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


సంక్రాంతికి పెద్ద హీరోల సందడి..

ఈ ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’ తో పాటు వెంకటేష్ (Venkatesh ) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలతో పాటు తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith) సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంటుందంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. ముందుగా మైత్రి మూవీ మేకర్స్ వారు అజిత్ హీరోగా నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల రెండు నెలల క్రితమే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేమని మైత్రి నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.


సంక్రాంతి బరి నుండి తప్పుకున్న అజిత్ మూవీ..

ఇక మరోవైపు తమ సినిమాను సమ్మర్ 2025 లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సినిమా వాయిదా వేయడంతో అజిత్ నటిస్తున్న మరొక సినిమా విడాముయార్చి సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అటు అజిత్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా లైకా ప్రొడక్షన్స్ వారు సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేమని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి చివరి వారంలో విడుదల..

ఇకపోతే ఎందుకు ఈ సినిమా వాయిదా పడింది అనే విషయాలు తెలియదు కానీ తాజాగా లైకా ప్రొడక్షన్స్ వారు మాత్రం తమ లేఖలో కొన్ని కారణాలవల్ల అంటూ పేర్కొనడం జరిగింది. మరి ఆ కొన్ని కారణాలు ఏంటి అనే విషయంపై తమిళ్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆర్థిక కారణాల వల్లే సినిమా వాయిదా పడిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం లైకా ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న ప్రతి సినిమా ఏదో ఒక విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందనే వార్తలు రాగా.. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆర్థిక కారణాలవల్లే వాయిదా పడింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పొంగల్ నుంచి తప్పుకున్న ఈ సినిమా జనవరిలోనే చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతి రేస్ నుంచీ తప్పుకోవడంతో అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తుండగా.. మరొకవైపు టాలీవుడ్ సినిమాలకు పోటీగా ఈ మూవీ ఎందుకు అంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నారు నెటిజన్స్.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×