E-Paper
Advertisement

Hari Hara Veera Mallu Song: పవన్ కళ్యాణ్ పాడిన పాట లిరిక్స్ ఇవే.. అల్లు అర్జున్‌కు కౌంటర్ ఇచ్చినట్టేనా.?

Hari Hara Veera Mallu Song: పవన్ కళ్యాణ్ పాడిన పాట లిరిక్స్ ఇవే.. అల్లు అర్జున్‌కు కౌంటర్ ఇచ్చినట్టేనా.?
Advertisement

Hari Hara Veera Mallu Song: సినిమాల్లో డైలాగ్స్, పాటల వెనుక చాలా అర్థాలు ఉంటాయి. సరిగ్గా వెతికితే అందులో కౌంటర్లు కూడా కనిపిస్తాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ నుండి ఒక పాటకు సంబంధించిన అప్డేట్ బయటికొచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం కోసం ఈ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను అందించారు మేకర్స్. కానీ ఈ పాట విడుదలకు ముందే సోషల్ మీడియాలో దీని గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఈ పాట లిరిక్స్.. ఎవరికో కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంటాయని, అది కూడా అల్లు అర్జున్‌ (Allu Arjun)కు కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తున్నాయని సమాచారం.

మరో అప్డేట్

Advertisement

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా లేదు. అయినా పవన్‌కు తెలుగులో ఉన్న మార్కెట్ అంతా ఇంతా కాదు. పైగా ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. అదే ‘హరి హర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయి ఈ మూవీకి టైమ్ ఇవ్వకపోవడంతో దర్శకుడిగా క్రిష్ తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి ఏఎమ్ జ్యోతికృష్ణ వచ్చారు. చాలాకాలం తర్వాత ఈ సినిమా నుండి విడుదలయిన అప్డేట్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది.

Also Read: సడన్‌గా వాయిదా వేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్… రీజన్ ఏం అయి ఉంటుంది..?

Advertisement

సెటైరికల్ లిరిక్స్

‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్ ప్రారంభమయినప్పుడు చిన్న గ్లింప్స్ విడుదలయ్యింది. మధ్యలో పలు పోస్టర్స్ బయటికొచ్చాయి. అంతకు మించి ఈ సినిమా నుండి ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అందుకే ఇన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ‘మాట వినాలి’ అనే పాట అప్డేట్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు మేకర్స్. అది మాత్రమే కాకుండా ఈ పాట సెటైరికల్‌గా ఉంటుందనే విషయం కూడా దీని కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు పెంచల్ దాస్ లిరిక్స్ అందించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తున్న అల్లు అర్జున్ ఇష్యూపైనే ఈ పాట కౌంటర్‌లాగా ఉంటుందని తెలుస్తోంది.

పాటల్లో కౌంటర్స్

జనవరి 6 ఉదయం 9.05 నిమిషాలకు ‘మాట వినాలి’ పూర్తి పాట విడుదల కానుంది. ఇప్పటికే ఇది అల్లు అర్జున్‌కు కౌంటర్‌లాగా ఉంటుందనే వార్తలు బయటికి రావడంతో ఈ పాట ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా, ఎప్పుడెప్పుడు విందామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆయన నటించిన ఎన్నో సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాటలు పాడారు. ఇంతకు ముందు ఆయన పాడిన పాటల్లో కూడా ఒకటి జగన్‌కు కౌంటర్ ఇచ్చినట్టుగా ఉందని ప్రేక్షకులు ఫీలయ్యారు. ఇప్పుడు అదే తోవలో అల్లు అర్జున్‌కు కౌంటర్ ఇవ్వడం కోసం ‘హరి హర వీరమల్లు’ మూవీ మేకర్స్ పాట సిద్ధం చేశారా లేదా అనేది విడుదలయిన తర్వాతే క్లారిటీ వస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×