BigTV English

Akhanda 2 : ‘అఖండ 2’ క్రేజీ అప్డేట్..బాలయ్యకు గురువుగా మరో హీరో..?

Akhanda 2 : ‘అఖండ 2’ క్రేజీ అప్డేట్..బాలయ్యకు గురువుగా మరో హీరో..?

Akhanda 2 : నందమూరి స్టార్ హీరో నటసింహం బాలయ్య వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది డాకు మహారాజ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ ఒకవైపు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఇక బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ అఖండ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఓ స్టార్ హీరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ పాత్రలో నటిస్తున్నాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


అఘోర పాత్రలో బాలయ్య.. 

ఇటీవల వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న బాలయ్య నుంచి అఖండ 2 రానున్న సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కి.. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ టీమ్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. వీరు కలిసి సినిమా చేసిన ప్రతీసారి ఒకదానికి మించి మరొకటి హిట్ అవుతూ వచ్చింది. అలా వీరి కాంబోలో చివరిగా వచ్చిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు రాబోతున్న’అఖండ 2′ కూడా అంతకు మించి హిట్ అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..


బాలయ్యకు గురువుగా సీనియర్ హీరో.. 

హిమాలయాల్లో శివలింగంకు అభిషేకం చేస్తూ పవర్ ఫుల్ రోల్ లో బాలయ్య ఇంట్రడక్షన్ ఉండనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. బాలయ్య ఎంట్రీలో వచ్చే విజువల్స్ మొత్తం సినిమాకి హైలెట్ కానున్నాయని తెలుస్తుంది. బాలయ్య ఎంట్రీ టైంలో వచ్చే విజిల్స్ కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని.. గూస్ బంప్స్ తెప్పించేలా ఆ సీన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య అఘోర పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు గతంలో మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈసారి బాలయ్య అఘోరగా కనిపిస్తే ఆయన గురువుగా సీనియర్ హీరో మురళీ మోహన్ నటిస్తున్నాడని తెలుస్తుంది.. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ ఇవ్వనున్నారని ఫిలింనగర్లో టాక్.. అఖండ 2 తాండవం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై.. రామ్ ఆచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×