OTT Movie : హాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఉన్నతమైన సినిమాగా ఈ మూవీని చెప్పుకుంటారు. 19 సంవత్సరాలు కష్టపడి ఒక జైలు నుంచి తప్పించుకుంటాడు హీరో. ఈ మూవీ తెరకెక్కిన విధానం ఇప్పటికీ ప్రత్యేకమైన శైలి లో ఉంటుంది. జైలు లో సాగే సన్నివేశాలు, చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ స్టోరీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరుగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది షావ్శాంక్ రెడెమ్షన్’ (The Shawshank Redemption). 1994లో విడుదలైన ఈ మూవీని స్టీఫెన్ కింగ్ రాసిన ‘Rita Hayworth and Shawshank Redemption’ అనే నవల ఆధారంగా ఫ్రాంక్ డారాబాంట్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో టిమ్ రాబిన్స్, మోర్గాన్ ఫ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక జైలు నేపథ్యంలో సాగే కథ . ఇందులో స్నేహం, ఆశ, ఆత్మ విశ్వాసం గురించి చూపిస్తుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఆండీ డుఫ్రెస్న్ ఒక బ్యాంక్ లో పని చేస్తుంటాడు. అతనిపై తన భార్య, ఆమె ప్రేమికుడిని హత్య చేసినట్లు నేరం మోపబడుతుంది. అందుకుగానూ జీవిత ఖైదు శిక్ష కూడా విధించబడుతుంది. అతను నిర్దోషిగా ఉన్నప్పటికీ, షాషాంక్ స్టేట్ పెనిటెన్షరీ అనే జైలుకి తరలించబడతాడు. అక్కడ అతను కఠినమైన జైలు జీవితంగడుపుతూ, అవినీతితో కూరుకుపోయిన వార్డెన్ ను ఎదుర్కొంటాడు. జైలులో ఉండగా రెడ్ అనే మరో ఖైదీతో ఆండీ ఎల్లిస్ స్నేహం చేస్తాడు. రెడ్ జైలులో వస్తువులను సమకూర్చే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు. ఆండీ తన బ్యాంకింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, జైలు వార్డెన్ నార్టన్ కోసం అక్రమ ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తాడు. దీని ద్వారా అతను వార్డెన్ నుండి కొంత రక్షణ పొందుతాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆండీ జైలు లైబ్రరీని అభివృద్ధి చేస్తాడు. ఇతర ఖైదీలకు విద్య అందించడంలో సహాయపడతాడు.
అయితే అతను రహస్యంగా తప్పించుకునే మార్గాన్ని రూపొందిస్తాడు. దాదాపు 19 సంవత్సరాల పాటు ఒక చిన్న రాతి సుత్తితో గోడలో సొరంగం తవ్వుతాడు. దాన్ని ఎవరికీ కనబడకుండా, రీటా హేవర్త్ అనే పోస్టర్‌తో కప్పివేస్తాడు. ఆ మట్టిని కూడా ప్యాంట్ జేబులో పెట్టుకుని పడేస్తుంటాడు. అలా చివరికి ఆండీ జైలు నుండి తప్పించుకుంటాడు. ఆ తరువాత వార్డెన్ అవినీతిని బయటపెడతాడు. దీని ఫలితంగా వార్డెన్ తప్పించుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆండీ తనకు సేకరించిన డబ్బుతో, మెక్సికోలోని జిహువాటనేజో అనే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పెరోల్‌పై విడుదలైన రెడ్, ఆండీ ఇచ్చిన సూచనలను అనుసరించి అతనితో కలుస్తాడు. ఇద్దరూ సముద్రతీరంలో తిరిగి కలిసి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొంది, హాలీవుడ్ గొప్ప సినిమాలలో ఒకటిగా నిలిచింది.