Big Stories

Agent on OTT : అప్పుడే ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. పాపం ఎంత దారుణం

Agent on OTT

Agent on OTT : టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఓ రూల్ పెట్టుకున్నారు. ముందు థియేటర్లను ఎంకరేజ్ చేద్దాం. ఆ తరువాతే ఓటీటీలను ఎంటర్‌టైన్ చేద్దాం అని. సినిమా రిలీజ్ అయిన 30 రోజుల తరువాతే ఓటీటీలోకి వచ్చేలా ప్లాన్ చేసుకుందామని అందరూ కలిసి మాట్లాడుకున్నారు. అలా చేస్తేనే ఓటీటీలకు క్రేజ్ తగ్గి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనేది వారి నమ్మకం. కాని, చాలా తక్కువ సమయంలో సీన్ రివర్స్ అయింది. సినిమాలు హిట్ అయితే ఓ లెక్క. ఓటీటీలో ఇప్పుడప్పుడే రాకుండా ఆపుకోవచ్చు. మరి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల పరిస్థితేంటి? అసలే థియేటర్లకు జనాన్ని రప్పించలేకపోయిన సినిమాను.. ఓటీటీలో కూడా లేట్ చేస్తే..

- Advertisement -

ఇక ఆ సినిమాను పూర్తిగా మరిచిపోతారు. అందుకే, కనీసం ఓటీటీలోనైనా ఆడుతుందన్న ఉద్దేశంతో ఎంతకో అంతకు అమ్మేస్తారు. ఒకవిధంగా ప్రొడ్యూసర్లకు ఇదే మంచిది కూడా. లైగర్ సినిమా ఎలాంటి అనుభవం మిగిల్చిందో అందరికీ తెలుసు. 200 కోట్లు ఇస్తాం… డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయండని ఆఫర్ ఇస్తే.. మా సినిమాతో థియేటర్లు పగిలిపోతాయ్ అని చెప్పి చేతులు కాల్చుకున్నారు. సో, అప్పటి నుంచి ఓటీటీ విషయంలో కాస్త తగ్గి మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్స్.

- Advertisement -

ఇప్పుడు ఏజెంట్ విషయంలోనూ అదే జరుగుతోంది. వీకెండ్ అయినా సరే జనం పెద్దగా ఏజెంట్ థియేటర్లకు రాలేదు. ఎప్పుడో విడుదలైన విరూపాక్షకు, సినిమా బాగుందన్న టాక్ రావడంతో పొన్నియన్ సెల్వన్-2 సినిమాకు వెళ్లారు ప్రేక్షకులు. సో, అఖిల్ ఏజెంట్‌ను వీలైనంత తొందరగా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే… ఏజెంట్ అనే సినిమా ఉందనే విషయం కూడా మరిచిపోతారనే భావనకు వచ్చారు.

ఏజెంట్ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌ ఇదివరకే సొంతం చేసుకుంది. సినిమా ఫట్ అవడంతో.. ఏజెంట్‌ మూవీని నెల లోపే ఓటీటీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. మే నెలాఖరులోపు సోనీలివ్‌లో ఏజెంట్‌ స్ట్రీమింగ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని చెబుతున్నప్పటికీ… నెలాఖరుకు కాదు.. మధ్యలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News