Big Stories

Earthquakes:- భూకంపాల గురించి షాకింగ్ విషయం బయటపెట్టిన నిపుణులు..

Earthquakes:- ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా మానవాళికి తీవ్ర నష్టాన్నే కలిగిస్తాయి. ఒకవేళ వాటిని అంచనా వేసే సామర్థ్యం ఉంటే అంత నష్టం జరగపోవచ్చని సామాన్యులు భావిస్తూ ఉంటారు. కానీ టెక్నాలజీ అనేది ఏ రేంజ్‌లో అభివృద్ధి అయినా.. ప్రకృతి వైపరీత్యాలను చాలా ముందుగా కష్టం అనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కొన్నింటిని మాత్రం ముందు కనిపెట్టగలిగినా.. ప్రజలను అలర్ట్ చేయడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. భూకంపాలను కనిపెట్టే విషయంలో ఇటీవల శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

- Advertisement -

ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాలు భూకంపాల దాటికి ఎంతో ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టాన్ని కూడా చవిచూశాయి. అందుకే భూకంపాలను ముందే కనిపెట్టే టెక్నాలజీని కనిపెట్టామని, కానీ అది చాలా ముందస్తుగా సమాచారం అందించలేదని పలువురు శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ అవేవి నమ్మవద్దని నిపుణులు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు భూకంపాలను ముందుగా కనిపెట్టే టెక్నాలజీలను తయారు చేసినా.. అవి కచ్చితంగా భూకంపం వచ్చే ప్రాంతాన్ని, సమయాన్ని అంచనా వేయలేవని చెప్తూ షాకిచ్చారు.

- Advertisement -

శాస్త్రవేత్తలు విడుదల చేసిన భూకంప అంచనాలు అనేవి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యి ప్రజలను కొంత సమయంలోనే అలర్ట్ చేస్తాయి. కానీ ఆ అంచనాలు ఏవి కచ్చితంగా జరిగేవి కాదని నిపుణులు బయటపెట్టారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో భూకంపాల గురించి వైరల్ అయ్యే వార్తలను ప్రజలు కూడా నమ్మవద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా భూకంప సూచనలు ఇవ్వలేదని, ఎందుకంటే వారి దగ్గర దీని గురించి కచ్చితమైన సమాచారం లేకపోవడమే కారణమని వారు తెలిపారు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మేజర్ భూకంపాలను ఒక్కసారి కూడా శాస్త్రవేత్తలు ముందస్తుగా అంచనా వేయలేదని నిపుణులు గుర్తుచేశారు. ఈరోజుల్లో భూకంపాలను అంచనా వేసే సైన్స్ కానీ, మ్యాజిక్ కానీ లేదని వారు అన్నారు. భూకంపాలను శాస్త్రవేత్తలు అంచనా వేయలేరు అని కచ్చితంగా చెప్పారు. భూకంపాల వెనుక ఉండే ఫిజిక్స్ చాలా కష్టమైనది అని, అలాంటి చిక్కుముడిని విప్పడం కష్టమని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News