Akhira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారసుడు అకిరా నందన్ (Akhira Nandan) సినిమా ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘ఓజి’ (OG) మూవీతో ఆ కల నెరవేరబోతోంది అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అటు పవన్ కళ్యాణ్ గానీ ఇటు చిత్ర బృందం గానీ ఈ వార్తలపై స్పందించలేదు. కానీ అంతలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ వీడియో లీకై పవన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ ‘ఓజి’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అకీరా నందన్ (Akhira Nandan) ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను పోషించబోతున్నాడని కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజమని ఈ తాజాగా లీక్ అయిన వీడియోతో తేలిపోయింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఓజీ’ మూవీ సెట్లో అఖీరా నందన్ ఉన్న వీడియో పవన్ అభిమానులను ఊపేస్తోంది.
ఈ వీడియోలో అఖీరా నందన్ (Akhira Nandan) ఫైట్ సీన్స్ లో రెచ్చిపోయాడు. పైగా అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ ఏంటంటే ఆ దుమ్ము రేపు ఫైట్ సీక్వెన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ పాపులర్ స్టైల్ లో కెమెరాకు ఫోజ్ ఇచ్చాడు. మొదటి సినిమానే అయినప్పటికీ అకిరా విలన్లను ఊచకోత కోసిన విధానం మామూలుగా లేదు. ఇక ఈ సీన్ బిగ్ స్క్రీన్ పై పడితే థియేటర్లు తగలబడడం ఖాయం. నిజానికి ఈ సీను డైరెక్టర్ థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరుగా ఉండేది. కానీ థియేటర్ల కంటే ముందే ఇలా సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అనేది కొంతమంది పవన్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. ఈ క్రేజీ ట్విస్ట్ థియేటర్లలో రివీల్ అయ్యి ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#Akiranandan in #TheyCallHimOG #PawannKalyan pic.twitter.com/Ll14DLXknu
— BigTv Cinema (@BigtvCinema) October 26, 2024
ఏదేమైనా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అకీరా నందన్ ఎట్టకేలకు ఇప్పటికైనా సినిమా ఎంట్రీ ఇవ్వడం అనేది మెగా ఫాన్స్ సంతోషపడే విషయమే. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవుతున్న నేపథ్యంలో ఇటు అకిరా నందన్ సినిమా ఎంట్రీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా లీకైన వీడియోను చూస్తుంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి తన వంతుగా వారసుడిని సినిమాల్లో నిలబడతారా ? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తాజాగా లీకైనా వీడియోలో అకిరా పూర్తి స్థాయిలో సినిమాలకు ప్రిపేర్ అయ్యారని అన్పిస్తోంది. మరి అఖిరా నందన్ (Akhira Nandan) తన తండ్రి స్టైల్ ని, స్వాగ్ ని మ్యాచ్ చేయగలడా ? అనేది తెలియాలంటే థియేటర్లలో అకిరాను చూసేదాకా వెయిట్ అండ్ సీ.