BigTV English

Priyanka Mohan: జయం రవితో నిశ్చితార్థం.. రూమర్స్ పై స్పందించిన హీరోయిన్..!

Priyanka Mohan: జయం రవితో నిశ్చితార్థం.. రూమర్స్ పై స్పందించిన హీరోయిన్..!

Priyanka Mohan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తో పోల్చుకుంటే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో సంవత్సరాల పాటూ వైవాహిక బంధంలో సంతోషంగా కొనసాగి , ఇప్పుడు విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీస్ ఎక్కువ అయ్యారని చెప్పవచ్చు. ఉదాహరణకు ధనుష్ (Dhanush ) ఆయన భార్య ఐశ్వర్య (Aishwarya ) 18 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జయం రవి(Jayam Ravi) కూడా తన భార్య ఆర్తి (Arti) నుంచి 15 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


భార్య నుంచి విడిపోయిన జయం రవి..

ఇదిలా ఉండగా ఒక ప్రముఖ సింగర్ తో ఈయనకు ఎఫైర్ ఉందని, ఆ కారణంగానే ఆర్తి కి విడాకులు ఇచ్చారంటూ వార్తలు రాగా.. ఆమె దీనిపై స్పందించి, జయం రవి తనకు బిజినెస్ పార్ట్నర్ మాత్రమే అని, తన విడాకులకు, తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరోవైపు ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) తో నిశ్చితార్థం జరిగిందంటూ కూడా ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అందరూ నిజమని అనుకున్నారు. వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయాలపై స్పందించింది ప్రియాంక మోహన్.


జయం రవితో ప్రియాంక మోహన్ నిశ్చితార్థం..

ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. జయం రవి , నేను కలిసి “బ్రదర్” అనే సినిమాలో నటించాము. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం కూడా ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది.. అయితే అందులో మేమిద్దరం మెడలో పూల దండలు వేసుకొని ఉండడం మీరు చూడవచ్చు. ఇప్పుడు అదే ఫోటోని పట్టుకొని మేమిద్దరం నిశ్చితార్థం చేసుకున్నామని అందరూ అనుకుంటున్నారు. వరుస షూటింగ్స్ కారణంగా ఈ విషయం నా దృష్టికి రాలేదు. ఆ సమయంలో ఇది నిజమేనని నమ్మిన టాలీవుడ్ లోని నా స్నేహితులు కూడా నాకు వరుసగా కాల్ చేశారు. కంగ్రాట్స్ కూడా చెప్పడంతో ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు.

రూమర్స్ పై స్పందించిన ప్రియాంక మోహన్..

ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయో పూర్తి విషయం తెలుసుకొని అది కేవలం సినిమాలో స్టిల్ మాత్రమే అని చెప్పాను. ఆ తర్వాత ఆ చిత్ర బృందాన్ని కూడా నేను తిట్టుకున్నాను. వేరే ఫోటో ఏదైనా రిలీజ్ చేయొచ్చు కదా అని, అయితే వారు కూడా ఆయన విడాకులు తీసుకున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం ఇలా చేసి ఉంటారనిపించింది. ఏది ఏమైనా వారు అలా ఫోటో రిలీజ్ చేయడం నాకు నచ్చలేదు అంటూ ప్రియాంక మోహన్ తెలిపింది. అంతేకాదు ఈ సంఘటనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని కూడా తెలిపింది ప్రియాంక.

ప్రియాంక మోహన్ సినిమాలు..

ఇక ఈమె నటించిన చిత్రాల విషయానికొస్తే.. నానీస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక మోహన్. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ప్రాజెక్టులు చేస్తున్న ఈమె ఇటీవల విడుదలైన సరిపోదా శనివారంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు జయం రవితో కలిసి బ్రదర్ సినిమాలో నటించగా.. ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది .మరొకవైపు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా నటిస్తోంది ప్రియాంక.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×