Akhil’s Fiancee Zainab Ravdjee : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో అఖిల్ అక్కినేని ఒకరు. సిసింద్రీ సినిమాతో బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ చాలా చిన్న ఏజ్ లోనే మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత మనం సినిమాలో కనిపించి ఆడియన్స్ కి మంచి సప్రైజ్ ఇచ్చాడు. అయితే అఖిల్ సినిమాల్లో కనిపించడానికి అంటే ముందు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవుతూ తన టాలెంట్ చూపించాడు. ఒక స్టేజ్ లో అఖిల్ మంచి క్రికెటర్ అయిపోతాడు అని చాలామంది ఊహించారు. కానీ వారసత్వంగా వస్తున్న సినిమా రంగంలోనే అఖిల్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు. వివి వినాయక్ (V.V Vinayak) దర్శకత్వం వహించిన అఖిల్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ (Akhil). ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఊహించని డిజాస్టర్ ను మూటగట్టుకుంది.
ఈ సినిమా తర్వాత అఖిల్ చేసిన మజ్ను (Majnu) సినిమా కూడా సక్సెస్ సాధించలేదు. ఇక ఫ్యామిలీకి మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రం కే కుమార్ దర్శకత్వంలో హలో అనే సినిమాను చేశాడు అఖిల్. ఈ హలో సినిమా కూడా పెద్దగా ఎవరికి వినిపించలేదు. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక సక్సెస్ అందుకున్నాడు. అఖిల్ కెరీర్ లో ఉన్న బెస్ట్ ఫిలిమ్స్ లో ఈ సినిమా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ సినిమా తోనే బొమ్మరిల్లు భాస్కర్ కూడా కం బ్యాక్ అయ్యాడు. ఇక సురేందర్ రెడ్డి (Surendhar Reddy) దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. సినిమా తర్వాత ఇప్పటివరకు అఖిల్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఒక అమ్మాయితో అఖిల్ కి ఎంగేజ్మెంట్ అయి కూడా అది ఆగిపోయింది.
ఇక అఖిల్ ప్రస్తుతం జైనబ్ రావ్ జీ అని దుబాయ్ కి సంబంధించిన మోడల్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య అక్కినేని కూడా శోభితా తో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇక అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి చాలామంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు. వీటిలో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తుంది. అఖిల్ కంటే జైనబ్ దాదాపు తొమ్మిదేళ్లు పెద్ద అని కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై కొంతమంది కొన్ని రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది మాత్రం సచిన్ రికార్డును బ్రేక్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. చాలా సినిమాలలో హీరో తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించినప్పుడు, సచిన్ మ్యారేజ్ లైఫ్ ఎగ్జాంపుల్ గా చెబుతూ వచ్చారు. ఇప్పుడు అది అఖిల్ రియల్ లైఫ్ కి వర్కౌట్ అయింది.
Also Read : Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా ?