Seeds School – Arion Campus: సీనియర్ సీడ్స్ ప్రైమరీ క్యాంపస్, సీడ్స్ ఏరియన్ క్యాంపస్ కు సంబంధించిన వార్షికోత్సవ వేడుకలు కలర్ ఫుల్ గా జరిగాయి. హైదరాబాద్ మియాపూర్ లోని విశ్వనాథ్ గార్డెన్స్ లో ‘సంగమం‘ పేరుతో ఈ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ‘అడ్వెంచర్స్ ఇన్ ది వండర్ ల్యాండ్’ థీమ్ తో జరిపిన ఈ వేడుకల్లో విద్యార్థుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ అశోక్ చక్రవర్తి, ప్రముఖ కథకురాలి రేణు చామర్తి హాజరయ్యారు. సీనియర్ సీడ్స్ ప్రైమరీ క్యాంపస్, సీడ్స్ ఏరియన్ క్యాంపస్ విద్యా సంస్థల వైస్-చైర్మన్ పాండు రంగా చారి, ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ ఈడ్పుగంటి నరేంద్ర ప్రసాద్, అకాడెమిక్ హెడ్ డాక్టర్ జయశ్రీ నాయర్ పాల్గొన్నారు.
చదువుతోనే ఉన్నత స్థానం!
విద్యార్థులు ఎంత క్రమశిక్షణతో పెరిగితే అంత మంచి భావితరం తయారవుతుందని డిప్యూటీ కలెక్టర్ అశోక్ చక్రవర్తి వివరించారు. చదువు మాత్రమే ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి చేరుతుందని తెలిపారు. విద్యార్థులు గురువులు, తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకుని సమాజానికి ఉపయోగపడాలని చెప్పారు. అటు క్యాంపస్ లో విద్యార్థులు ఎలా నడుచుకుంటారో, పెదయ్యక అలాగే నడుచుకుంటారని రేణు చామర్తి తెలిపారు. చిన్నప్పటి నుంచే ఉన్నతమైన ఆలోచనలు చేయాలని సూచించారు. చదువుతో పాటు సామాజిక అంశాల మీద అవగాహన పెంచుకోవాలన్నారు. రానున్న రోజుల్లో చదువు ఒక్కటి సరిపోదని, స్కిల్స్ చాలా ముఖ్యం అన్నారు. మార్కులతో పాటు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు.
Read Also:2025లో పాతబస్తీకి మెట్రో.. విమానాశ్రయం రూట్ లో 24 స్టేషన్లు.. విస్తరణకు మొత్తం ఖర్చు ఎంతంటే?
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
ఇక ‘సంగమం’ వార్షికోత్సవంలో భాగంగా ‘అడ్వెంచర్స్ ఇన్ ది వండర్ ల్యాండ్’ థీమ్ తో విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఆటలు, పాటలు అందరినీ అలరించాయి. రంగులతో అలంకరించిన వేదికపై అందంగా ముస్తాబై విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పిల్లల వేసిన నాటికలు అందరినీ ఆలోచింపజేశాయి. ఇక ఈ సందర్భంగా రెండు క్యాంపస్ లకు చెందిన హెడ్స్ గరిమ కుమార్, నాగవల్లి యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. విద్యార్థుల విద్యా విధానం, సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం చదువులతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు.
Read Also:చెప్పులు లేని చిన్నారిని చూసి.. చలించిపోయిన మంత్రి కొండా సురేఖ, వెంటనే ఏం చేశారంటే..