BigTV English

Nagarjuna Ex wife Lakshmi: నాగార్జున మొదటి భార్యను చూశారా.. ఇలా మారిపోయిందేంటి..?

Nagarjuna Ex wife Lakshmi: నాగార్జున మొదటి భార్యను చూశారా.. ఇలా మారిపోయిందేంటి..?

Nagarjuna Ex wife Lakshmi latest Photos: అక్కినేని నాగార్జున నటించిన తొలి సినిమా ‘విక్రం’. ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన నాగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అప్పటికీ మంచి ఫేమ్‌లో ఉన్న నాగ్ ఇప్పటికే అదే జోష్‌లో దూసుకుపోతున్నాడు. కొత్త కొత్త సినిమాలతో కుర్రకారు హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు. అయితే 1984లో రామానాయుడు కూతురు, హీరో వెంకటేష్ సోదరి లక్ష్మిని మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి1986లో నాగచైతన్య జన్మించాడు.


అయితే కొన్నేళ్ల తర్వాత నాగార్జునకు, తన భార్య లక్ష్మికి అనివార్య కారణాల వల్ల విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిరువురు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో నాగార్జున శివ సినిమాలో సహనటి అయిన అమలను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి పుట్టిన వాడే అఖిల్. ఇక నటి అమల అందరికీ సుపరిచితమే. కానీ నాగచైతన్య తల్లి లక్ష్మి మాత్రం పెద్దగా కొందరికి తెలిసుండదు.

ఆమెను చూసిన వాళ్లు కూడా చాలా రేర్‌గా ఉంటారు. అయితే చిన్నప్పటి నుంచి నాగచైతన్య తన తల్లి లక్ష్మి దగ్గరే పెరిగాడు. ఇక పెద్దయ్యాక చైతన్య తన తండ్రి నాగార్జున దగ్గరకు షిఫ్ట్ అయిపోయాడు. అయితే నాగార్జున గురించి అందరికీ తెలుసు.. కానీ లక్ష్మి గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పుడు నాగార్జున మొదటి భార్య ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొద్ది సంవత్సరాల క్రితమే చైతన్య తన తల్లి లక్ష్మి గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. అయితే ఈ రోజు మదర్స్ డే కావడంతో తన తల్లి లక్ష్మితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.


Also Read: తెలుగు హీరోయిన్ తో నాగ చైతన్య రెండో పెళ్లి..?

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అక్కినేని నాగ చైతన్య తన తల్లిపక్కనే నిల్చుని కనిపిస్తున్నాడు. అయితే లక్ష్మి మాత్రం అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఇదేంటి నాగార్జున మొదటి భార్య ఇలా మారిపోయిందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా నాగ చైతన్య సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. శ్రీకాకుళం యాసతో తెరకెక్కుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దర్శకుడు చందూ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఇందులో నాగ చైతన్య డిఫరెంట్ లుక్‌లో ఒక మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్డేట్‌లు రానున్నాయి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×