BigTV English

Akkineni Naga Chaitanya: ఇంట్లో రూలింగ్ అంతా శోభితాదే.. నా పరువు కాపాడండి.. ప్లీజ్

Akkineni Naga Chaitanya: ఇంట్లో రూలింగ్ అంతా శోభితాదే.. నా పరువు కాపాడండి.. ప్లీజ్

Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. ఇక ఈ సినిమాను బన్నీవాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 7 న తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నేడు ఈ సినిమా ట్రైలర్ ను వైజాగ్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు నాగచైతన్య, అల్లు అరవింద్ హాజరయ్యారు.


తండేల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ .. ” ఫస్ట్ ట్రైలర్ తీసుకొచ్చి.. వైజాగ్ లో ఉన్నవారికి చూపించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే.. తండేల్ ప్రయాణం అంతా వైజాగ్ లోనే ఉంది. ముందు వైజాగ్ వచ్చి.. ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్లి, అక్కడివారిని చూసి.. కొన్నిరోజులు నేను అక్కడ అన్ని నేర్చుకున్నాను. అక్కడ ప్రజలు ఎలా ఉంటారు.. ? ఏం చేస్తారు.. ? అన్ని తెలుసుకున్నాను. ఆ తరువాత  వైజాగ్ వచ్చి.. జాలరీ పేటలో తిరిగి.. యాట చూసి, నేర్చుకున్నాకా నాకు తండేల్  రాజు క్యారెక్టర్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడకు వచ్చి ఉండకపోతే అసలు తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు.

Jani Master: తెలుగు వదిలేసి అక్కడకు మకాం మార్చిన జానీ మాస్టర్.. ఆ స్టార్ హీరో బ్లెస్సింగ్స్ తో..


నేను చాలామందికి థాంక్స్ చెప్పాలి. మన పుష్ప కా బాప్ అల్లు అరవింద్ గారు.  గత ఏడాదిన్నర నుంచి నా జీవితంలో నిజమైన తండేల్  ఆయనే. చివరికి వచ్చేసరికి.. ఆయన లేకుండా నేను ఇంకో సినిమా ఎలా చేస్తానా.. ? ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా కోసం ఆయన ఇన్ పుట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక వైజాగ్ విషయానికొస్తే.. నేను ఏ సినిమా రిలీజ్ తరువాత ఫస్ట్ వైజాగ్ లో టాక్ ఏంటి అని కనుక్కుంటాను. ఎందుకంటే ఇక్కడ  సినిమా ఆడింది అంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే.

వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే..  వైజాగ్ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. మీ అందరికీ నా విన్నపం. తండేల్ సినిమాకు వైజాగ్ లో కలక్షన్స్ షేక్ అయిపోవాలి. లేకపోతే నా  పరువుపోతుంది ఇంట్లో.. ప్లీజ్. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. చందు మొండేటి నాకు ఒక డైలాగ్ చెప్పాడు. ఈపాలి యాట గురితప్పేదే లేదేస్ అని..ఫిబ్రవరి 7 కు రాజులమ్మ జాతరే.  నాన్న,  మన కింగ్ చెప్తూ ఉంటారు.. వస్తున్నాం.. కొడుతున్నాం అని.. తండేల్ రాజు భాషలో చెప్పాలంటే.. దుళ్లకొట్టేస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు.

ఇక నటి శోభితా తెనాలి అమ్మాయి. పుట్టింది తెనాలిలో అయినా.. శోభితా పెరిగింది మొత్తం వైజాగ్ లోనే. అందుకే చై.. వైజాగ్ అమ్మాయిని పెళ్లాడినట్లు చెప్పాడు.  ఇక సమంతతో చై విడిపోయాకా.. అతని లైఫ్ లోకి శోభితా వచ్చింది. రెండేళ్లు డేటింగ్ తరువాత వీరిద్దరూ గతేడాది ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత చై మొదటి సంక్రాంతికి  తెనాలి  కూడా వచ్చాడు. మరి తండేల్ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×