Wedding Dates 2025 : 2025లో పెళ్లి బంధంతో ఎందరో జంటలు ఏకమవుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహూర్తాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఈ శుభ సమయాల్లో ఎటువంటి సమస్య లేకుండా నచ్చిన ముహుర్తాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.
2025 జనవరి 14న మకర సంక్రాంతి నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. శ్రీధరి పంచాంగ్ ప్రకారం ఈ ఏడాది మొత్తం 40 శుభముహూర్తాలు ఉన్నాయి. 2024 తో పోలిస్తే ఈ సంఖ్యా కాస్త తక్కువ అయినప్పటికీ తిథి, రాశుల ప్రకారం చూస్తే శుభ ఘడియలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్లకు మాత్రమే కాకుండా నిశ్చితార్థం, ఇతర శుభకార్యాలకు సైతం అనుకూలంగా ఉంది. ఇక ఆయా నెలల్లో ఉన్న పెళ్లి ముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25 తేదీలలో పెళ్లికి మంచి ముహూర్తాలు ఉన్నాయి
మార్చిలో 1, 2, 6, 7, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి
ఏప్రిల్ నెలలో 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీలు పెళ్లికి శుభ ఘడియలు
మే నెలలో 1, 5, 6, 8, 15, 17, 18 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
జూన్ నెలలో 1, 2, 4, 7 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు
జూన్ తర్వాత మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలలో మాత్రమే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్లో 22, 23, 27, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండగా.. డిసెంబర్ లో 4, 11 తేదీల్లో అనుకూలంగా ఉంది. ఇక ఈ ఏడాది కొన్ని నెలల్లో పెళ్లికి ముహూర్తాలు లేకపోవడానికి గ్రహాల సంచారమే కారణమని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహాల సంచారం శుభకార్యాలకు అనుకూలంగా లేదని.. జూలై నుంచి అక్టోబర్ వరకు దేవశయనం ఉంటుందని తెలుపుతున్నారు. ఈ సమయంలో దేవతలు నిద్రిస్తారని.. అందుకే పెళ్లిళ్లు జరగవని పురాణాలు చెబుతున్నాయి.
2025 డిసెంబర్ 15 నుంచి 2026 జనవరి 14 వరకు ఖర్మాసం ఉండటంతో ఈ సమయంలో సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తాడని… పెళ్లిళ్లకు శుభ ఘడియలు కాదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే జంటలు జూన్ వరకూ ఉన్న శుభ ముహూర్తాల్లో చేసుకోవడం మంచిదని పండితులు భావిస్తున్నారు.
ALSO READ : స్కూలు బస్సులన్నీ పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? వేరే రంగు ఎందుకు వేయరు?