Mass Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. స్టార్ హీరోల బర్త్ డేస్ కు, స్పెషల్ డేస్ కు.. పాత సినిమాలను కొత్త థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక అప్పుడు మిస్ అయిన వైబ్ ను ప్రేక్షకులు మరోసారి థియేటర్ లో చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి రీ రిలీజ్ చేశారు.
ఇక మహేష్ ఫ్యాన్స్.. థియేటర్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. థియేటర్ లో పెళ్లి చేసుకోవడం, సాంగ్స్, అమ్మాయిలు రీల్స్.. అబ్బో అసలు తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎలా ఎంజాయ్ చేస్తారు అనేదానికి నిదర్శనం అంటే ఇదే అని అనిపించేలా చేశారు. ఇక దీంతో రీ రిలీజ్ ట్రెండ్ మరింత పెరిగింది. మురారి మాత్రమే కాదు.. త్వరలోనే ఇంద్ర, శంకర్ దాదా MBBS లాంటి సినిమాలు రీ రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇక వీటి లిస్ట్ లో మరో హిట్ సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది.
అక్కినేని నాగార్జున, జ్యోతిక జంటగా నటించిన మాస్ మూవీ రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నాగ్.. మాస్ కు బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి నిరూపించిన సినిమా అంటే ఇదే.
ఇక ఈ సినిమా ఆగస్టు 28వ తేదీగా ప్రత్యేకంగా రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక దీంతో అక్కినేని ఫ్యాన్స్.. మాస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. అన్న షర్ట్ ఏస్తే మాస్.. అంటూ పాటలు మొదలుపెట్టేసారు. మరి ఈ సినిమా రోజు అక్కినేని అభిమానులు ఎలాంటి రచ్చ చేయనున్నారో చూడాలి.