Akkineni Nagarjuna: మంత్రి కొండా సురేఖ.. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ జీవితాలను నాశనం చేసింది కేటీఆరే అని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం కేటీఆరే అని, N కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్, నాగార్జునను అడిగాడని, నాగార్జున కూడా సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళమని చెప్పాడని, అది ఒప్పుకోలేక సామ్ విడాకులు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు.
ఇక ఉదయం నుంచి ఈ వార్త దావానంలా సోషల్ మీడియా మొత్తం పాకింది. ఇక అక్కినేని కుటుంబం పై వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు అక్కినేని నాగార్జున స్పందించాడు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుపుతూ నాగ్.. ట్వీట్ చేశాడు.
” గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
నిజం చెప్పాలంటే.. కొండా సురేఖ మాట్లాడిన మాటలు.. అక్కినేని కుటుంబం మొత్తం లెగసీని ప్రశ్నర్ధకంగా మార్చింది. అందుకే నాగ్ వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. ఇక సమంత విషయానికొస్తే.. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సమంత ఫోన్ ను కూడా ట్యాప్ చేసారని, అందులో కొన్ని నిజాలు బయటపడడం.. అవి నాగార్జున వద్దకు వెళ్లడం వలన సామ్ – చై విడాకులు జరిగాయని వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఏది నిజం.. ఏది అబద్దం అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వ్యాఖ్యలపై సమంత ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024