Janasena Leader: ఆ జనసేన నేతకు తప్పక రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందేనట. లేకుంటే కుదరదని తేల్చి చెప్పేస్తున్నారు పలువురు సీనియర్ నాయకులు. ఆయనకు సీటు ఇస్తేనే, జనసేనకు న్యాయం జరిగినట్లు తాము భావిస్తామని లేకుంటే అన్యాయం జరిగినట్లేనంటూ ప్రకటనలు కూడా విడుదల అవుతున్నాయి. మేము ఒప్పుకోము.. మా నాయకుడికి తప్పక ఇవ్వాల్సిందే. ప్రకటన ఎప్పుడంటూ డిమాండ్ మార్మోగి పోతోంది. తాజాగా ఓ సీనియర్ నేతకు అదే పాట పాడారు. ఏకంగా ఓ లేఖను సైతం విడుదల చేశారు. దీనితో కూటమి నేతలు కూడా ఈ విషయంపై పూర్తిగా దృష్టి సారించారట. అసలు నేత మాత్రం సైలెంట్ గా ఉంటే.. ఈ డిమాండ్స్ గోల ఏమిటని కూడా చర్చ సాగుతోందట.
ఇటీవల ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణకై ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అది కూడా వైసీపీ నుండి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ వలి టీడీపీలో చేరుతూ.. తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా సమర్పించారు. అలాగే బీసీ నేత కృష్ణయ్య కూడా తన పదవికి రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇక అంతే ఏపీలో రాజకీయ హడావుడి మళ్లీ మొదలైంది.
ఇలా రాజ్యసభ సీట్లకు షెడ్యూల్ విడుదల కాగానే, జనసేనకు చెందిన ఆ నేత పేరు మార్మోగుతోంది. ఈ నేత జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అందులో కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగించారు. అంతేకాదు వైసీపీ నేతలపై గుర్రుగా కామెంట్స్ చేశారు. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయంలో కూడా ఈయన కీలకం. అంతేకాదు పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకు రావడంలో ఈయన రూటే సపరేట్. జనసేన కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే చాలు.. మై హూ నా అంటూ అలా వాలిపోతారు.
Also Read: Be Alert: ట్రింగ్.. ట్రింగ్.. హలో.. ఒకటి నొక్కండి చాలు.. అధోగతే!
అటువంటి నేతకు ఎలాగైనా రాజ్యసభ సీటు కేటాయించాలని సీనియర్ నాయకులు, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అద్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. జనసేనకు నామినేటెడ్ పోస్టుల్లో 30 శాతం కేటాయిస్తామని కూటమి నేతలు ప్రకటించారని, మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు తప్పక కేటాయించాలని జోగయ్య కోరారు. ఆయనకు రాజ్యసభ సీటు కేటాయించాలని డిమాండ్ వినబడుతున్నా, ఆనేత మాత్రం ఇప్పటి వరకు నోరెత్తలేదు. ఇంతకు ఆ నేత ఎవరని అనుకుంటున్నారా.. ఆయనే మెగా బ్రదర్ నాగబాబు.