BigTV English

Akkineni’s New movies :  అక్కినేని ఫ్యామిలీ మళ్లీ షూరూ చేసింది.. పట్టాలెక్కుతున్న ముగ్గురి సినిమాలు

Akkineni’s  New  movies :  అక్కినేని ఫ్యామిలీ మళ్లీ షూరూ చేసింది.. పట్టాలెక్కుతున్న ముగ్గురి సినిమాలు


Akkineni’s New movies : ఇండస్ట్రీలో ఎవరికీ రాని కష్టం ఇది. అక్కినేని ఫ్యామిలీలోని ప్రతి హీరోకు తగిలిన ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముందు ఢమాల్ అన్నాయి. బహుశా ఎవరికీ కాలం కలిసి రావట్లేదనుకుంటా. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌ సినిమాలు బొక్కబోర్లా పడ్డాయి. అలాగని ఫెయిల్యూర్స్‌ను తలచుకుని ఎన్నాళ్లని బాధపడతారు. అందుకే, బాధపడింది చాలు ఇక సెట్స్‌లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

రైటర్ బెజవాడ ప్రసన్న కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేయబోతున్నాడు. బెజవాడ ప్రసన్నకు డైరెక్టరుగా ఇదే ఫస్ట్ సినిమా. జూన్ సెకండ్ వీక్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, జులై సెకండ్ వీక్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అప్పటికి ఎండలు కూడా తగ్గి వర్షాలు కూడా మొదలవుతాయి కాబట్టి నాగార్జున కూడా ఓకే చెప్పారు. నాగ చైతన్య కస్టడీ సినిమాను ప్రొడ్యూస్ చేసిన చిట్టూరి శ్రీను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ఇక నాగ చైతన్య కూడా కథలు వింటున్నాడు. ఓ రైటర్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ స్టోరీతో స్క్రిప్ట్ వినిపించాడని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సాయిధరమ్ తేజ్‌కు కూడా ఇలాంటి కాన్సెప్టుతో వచ్చిన చిత్రలహరి సినిమాతోనే బ్రేక్ వచ్చింది. అయితే, స్టోరీ చెప్పిన రైటరే డైరెక్టర్‌గా ఉంటాడా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ రైటరే డైరెక్టర్ అయితే… నాగార్జున, నాగ చైతన్య కూడా ఒక దారిలో వెళ్తున్నట్టు లెక్క.

ఇక ఏజెంట్ డిజాస్టర్‌తో ఆల్‌మోస్ట్ డిప్రెషన్‌ స్టేజ్‌కి వెళ్లిన అఖిల్.. యూవీ క్రియేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఓ కొత్త డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్, అఖిల్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా భారీ బడ్జెట్‌తో రాబోతోందని చెబుతున్నారు. కాకపోతే, యూవీ క్రియేషన్ సినిమా ప్రస్తుతం ఆదిపురుష్ ప్రమోషన్‌లో ఉంది. దీనితో పాటు మిస్ శెట్టి..మిస్టర్ శెట్టి సినిమా కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. అయినా సరే అఖిల్ మూవీ కోసం ప్రీ పొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టారట. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×