BigTV English

Malli Pelli Review: నరేశ్‌, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’.. ఎలా జరిగిందంటే! ఎలా ఉందంటే!

Malli Pelli Review: నరేశ్‌, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’.. ఎలా జరిగిందంటే! ఎలా ఉందంటే!
Malli pelli

Malli pelli review: ఈమధ్య కాలంలో మోస్ట్ కాంట్రవర్సియల్ ఇష్యూ. బాగా పబ్లిసిటీ వచ్చిన గొడవ. ఆ లొల్లిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు నరేశ్. మళ్లీ పెళ్లితో ఆ వివాదంను తన వెర్షన్‌లో చూపించారు. రిలీజ్‌కు ముందే ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. అందుకే, ఓపెనింగ్స్ బాగున్నాయ్.. మరి, సినిమా ఎలా ఉంది?


స్టోరీ: యాక్టర్ న‌రేంద‌ర్ (న‌రేశ్‌), సౌమ్య సేతుప‌తి (వనిత విజ‌య్‌కుమార్‌) పెళ్లి చేసుకుంటారు. వారికో బిడ్డ పుడుతుంది. ఆ తర్వాత కాపురంలో గొడవ మొదలవుతుంది. ఆ సమయంలో నరేందర్ లైఫ్‌లోకి మరో టాప్ యాక్ట్రెస్ పార్వ‌తి (ప‌విత్ర లోకేశ్‌) వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆమె కోసం నరేందర్ ఏం చేశాడు? వారి కాపురం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది స్టోరీ.

ఎంతగా కాదంటున్నా.. న‌రేశ్‌, ప‌విత్ర‌ల రియల్ స్టోరీనే ఈ మళ్లీ పెళ్లి. ఇన్నాళ్లూ టీవీల్లో చూసిన గొడవలన్నీ.. థియేటర్లలో చూపించారు. వాళ్ల సొంత యవ్వారాన్ని సినిమాగా మార్చేశారు. నరేశ్, పవిత్రలు వాళ్ల స్టోరీని వాళ్లే సినిమాగా తీసుకుని.. జనాల మీదకు వదిలారు. వాళ్ల పెళ్లి క్యాసెట్‌ను ప్రేక్షకులు డబ్బులు పెట్టి టికెట్ కొని.. చూసేలా చేసే ప్రయత్నమే ఈ మళ్లీ పెళ్లి.


ఫస్ట్ హాఫ్‌లో నరేశ్, పవిత్రల రిలేషన్ గురించి చూపించారు. నరేశ్‌కు, అతని మూడో భార్యతో ఉన్న విభేదాలను ఆయన యాంగిల్‌లో ప్రెజెంట్ చేశారు. ఇక పార్వతి ( పవిత్రా లోకేశ్) పర్సనల్ లైఫ్‌కు సెకండాఫ్‌లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. పార్వతికి, ఆమె పార్ట్‌నర్‌కు మధ్య ఏం జరిగింది? ఆమె నరేశ్‌కు ఎలా దగ్గరైంది? ఇలాంటి పాయింట్స్ కవర్ చేశారు. అనుకున్నట్టుగానే, సౌమ్య క్యారెక్టర్‌ను నెగటివ్ షేడ్‌లో చూపించారు. ట్రైలర్‌లో చూపించిన కొన్ని అసభ్య సీన్లు థియేటర్లో రోత పుట్టిస్తాయి. నిర్మాణ పరంగా సినిమా బాగుంది. అందరికీ తెలిసిన కథనే.. వాళ్ల జీవితాల్లోని గొడవను.. సినిమాగా చూపించారు. ఇన్నాళ్లూ టీవీల్లో చూసిన కాంట్రవర్సీ స్టోరీని.. థియేటర్లో మరోసారి చూసి ఎంజాయ్ చేయాలంటే ‘మళ్లీ పెళ్లి’కి వెళ్లొచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×