BigTV English

Akshay Kumar: ఆటో రిక్షా నడుపుతోన్న మహిళకు అక్షయ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఆమెకు ఎంత సాయం చేశాడంటే?

Akshay Kumar: ఆటో రిక్షా నడుపుతోన్న మహిళకు అక్షయ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఆమెకు ఎంత సాయం చేశాడంటే?

Akshay Kumar.. ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకవైపు హీరోగా, మరొకవైపు విలన్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈయన నటించిన ఎన్నో చిత్రాలు ఈయనకు ఊహించని పాపులారిటీని సంపాదించి పెట్టాయి. అందుకే అటు నార్త్ ఇటు సౌత్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఒక ఆటో రిక్షా నడుపుతున్న మహిళకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరిచారు అక్షయ్ కుమార్. అంతేకాదు ఆమెకు ఆర్థిక సహాయం కూడా చేసి గొప్ప మనసు చాటుకున్నారు.


మహిళ ఆటో డ్రైవర్ ను కలిసిన అక్షయ్ కుమార్..

అసలు విషయంలోకి వెళ్తే.. ముంబై ప్రాంతంలో మొదటి మహిళా ఆటో డ్రైవర్ గా పేరు సొంతం చేసుకున్న ఛాయా మోహిత కి సర్ప్రైజ్ ఇచ్చారు అక్షయ్ కుమార్ అతని బృందం. అసలు విషయంలోకి వెళ్తే ముంబైలో మొదటి మహిళా ఆటో రిక్షా డ్రైవర్ బయోపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెను కలవాలని నిర్ణయించుకున్నాడు అక్షయ్ కుమార్. అయితే ఆమె పేరు, ఫోటో తప్ప ఆమె గురించి వివరాలు ఏమీ తెలియకపోవడంతో ఆమెను కనుగొనడానికి అక్షయ్ కుమార్ బృందానికి దాదాపు రెండు నెలల సమయం పట్టిందట. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న రిక్షా డ్రైవర్ ఛాయా మోహిత అక్షయ్ కుమార్ తనను కలవడానికి ఏ విధంగా సంప్రదించారు… తనకు ఎలాంటి సహాయం అందించారు..? అనే విషయాలను ఆమె వెల్లడించింది.


రూ.10,000 ఆర్థిక సాయం..

ఆ రోజుల్లో ఎంతోమంది యూట్యూబర్లు నా ఇంటికి వచ్చి గృహిణిగా, రిక్షా డ్రైవర్ గా ఎలా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అనే విషయాలను ప్రతిరోజు వీడియోలు చేసేవారు. ఆ ఇంటర్వ్యూలకు చార్జీలు విధించాలని కొంతమంది నాకు సలహా ఇచ్చినా నా భర్త మాత్రం వాటికి ఒప్పుకోలేదు. అయితే ఒకరోజు షూటింగ్ అయిన తర్వాత నన్ను సన్ ఎన్ సాండ్ హోటల్ కు తీసుకెళ్ళమని ఒకరు నన్ను అడిగారు. నా ఆటోలో ఉన్నది ఎవరో కాదు అక్షయ్ కుమార్. ఆయన జుహు లో ఉండే వారి ఇంటికి తనను తీసుకెళ్ళమన్నారు. అందులో ఆయన భార్య , అమ్మ కూడా ఉన్నారు. వారు చెప్పినట్టుగానే.. నేను వారిని వారింటికి తీసుకెళ్లాను. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కలవాలన్నా నేరుగా వచ్చి కలవవచ్చని నాతో చెప్పారు. కానీ ఆయనను కలవడానికి నాకు సమయం కుదరలేదు.

ప్రశంసల వెల్లువ..

అయితే నా పరిస్థితులను చూసి ఆయన నాకు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. ముఖ్యంగా ఆయన అందించిన ఆ సహాయం నా కుటుంబానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడింది. ఆయన చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ అక్షయ్ కుమార్ గొప్పతనాన్ని ఛాయా మెహతా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అక్షయ్ కుమార్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×