లిచీ పండ్లను తిన్నాక అందులో ఉన్న గింజను బయట పడేస్తారు. నిజానికి ఆ గింజల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. మనల్ని ఎన్నో వ్యాధుల బారిన పడకుండా కాపాడే గొప్ప లక్షణాలు ఉన్నాయి. లిచీ గింజలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.
లిచీ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలగకుండా కాపాడతాయి. ఆక్సీకరణం వల్ల శరీర కణాలు నష్టపోకుండా రక్షిస్తాయి. అంతేకాదు శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ నుండి యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా అడ్డుకునే శక్తి కూడా లిచీ గింజలకు ఉంది.
జీర్ణ సమస్యలు రాకుండా
ఎంతోమంది జీర్ణపరమైన అసౌకర్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి లిచీ గింజలు ఎంతో సహాయ పడతాయి. అవి అజీర్ణం, అతిసారం వంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి. లిచీ గింజల్లో ఎన్నో సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పొట్టనొప్పిని కూడా తగ్గిస్తాయి.
శరీరంలో ఇన్ఫ్మమేషన్ అనేది ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతుంది. ఆర్థరైటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి కూడా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తాయి. లిచీ గింజలను తినడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో చేరుతాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.
చర్మానికి మెరుపు
చర్మం మెరిసిపోవడానికి కూడా లిచీ గింజలు ఉపయోగపడతాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి తోడ్పడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా వృద్ధాప్యం బారిన పడకుండా కాపాడతాయి. శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేయడంలో లిచీ గింజలు ముందుంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హృదయనాళ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు లిచీ గింజలను కచ్చితంగా తీసుకోవాలి. ఈ లిచీ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో ముందుంటాయి.
లిచీ గింజల పొడి
లిచీ గింజలను ఎలా ఆహారంలో భాగం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? వీటిని ఎండబెట్టి పొడి రూపంలోకి మార్చుకోండి. బాగా ఎండబెడితే ఇవి మిక్సీలోనే పొడిగా మారిపోతాయి. కాకపోతే ఈ పొడిని అతిగా తినడం ప్రమాదకరం. చిటికెడు పొడిని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగేందుకు ప్రయత్నించండి. అయితే పచ్చి లిచీలు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి నిపుణుల సలహా తీసుకొనే వీటిని తినాలి. కొన్ని పండ్ల వల్ల అలర్జీలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి.. జాగ్రత్త.
Also Read: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.