BigTV English

Alia Bhatt: అలియా సంపాదన ముందు వారంతా జుజూబీ.. ఎన్ని కోట్లంటే..?

Alia Bhatt: అలియా సంపాదన ముందు వారంతా జుజూబీ.. ఎన్ని కోట్లంటే..?

Alia Bhatt : మహేష్ భట్ (Mahesh Bhatt) వారసురాలిగా బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి నేచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న అలియా భట్ (Alia Bhatt) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించి నేడు స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇకపోతే తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరొకసారి జిగ్రా అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతోంది.


జిగ్రా మూవీతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు..

హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ అభిమానులే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి.. ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా సమంతను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అలియా భట్ మూవీని ప్రమోట్ చేయడానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యి.. ఈవెంట్ ను సక్సెస్ చేశారు. వాసన్ బాలా దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


ఒక్కో సినిమాకు రూ .18 కోట్ల రెమ్యూనరేషన్..

ఇప్పటికే గంగుబాయి కతియావాడి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాతో మరో అవార్డును కూడా అందుకుంటుంది అంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో పవర్ ఫుల్ పాత్రలో ఈమె నటిస్తోందని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు ఆరు ఫిలింఫేర్ అవార్డులతో పాటు మరిన్ని పురస్కారాలు సొంతం చేసుకుంది అలియా భట్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.18 కోట్ల పారితోషకం తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

అలియా భట్ ఆస్తుల విలువ..

అలియా భట్ రూ.550 కోట్లకు అధిపతి అని సమాచారం. నటన, ఎండార్స్మెంట్ తో పాటు బిజినెస్ వెంచర్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తుందని సమాచారం నటనతో పాటు వ్యాపారంగంలో కూడా అడుగుపెట్టిన ఈమె చిన్నపిల్లల దుస్తులు బ్రాండ్ ఎడ్ ఎ మమ్మ అనే వ్యాపారాన్ని 2020లో ప్రారంభించింది. దీని విలువ రూ.150 కోట్లు అలాగే సొంతంగా ఎటర్నల్ సన్ సైన్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ కూడా ఉంది. అలాగే లండన్, ముంబై వంటి ప్రాంతాలలో ఖరీదైన స్థలాలు, బంగ్లాలు కొనుగోలు చేసింది. బాంద్రాలో కూడా ఒక బంగ్లా ఉండగా దీని విలువ రూ.32 కోట్లు. అలాగే ముంబైలో ఉండే అపార్ట్మెంట్ ధర రూ.35 కోట్లు. ఇక ఈమె దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ తో పాటు హై ఎండ్ కార్లను కూడా కలిగి ఉంది. మొత్తానికి అయితే అలియా భట్ ఆస్తులు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×