BigTV English

Dil Raju : పాన్ ఇండియా టైటిల్ కష్టాలు… ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?

Dil Raju : పాన్ ఇండియా టైటిల్ కష్టాలు… ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?

Dil Raju : ఇటీవల కాలంలో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఈ సినిమాలను అన్నీ భాషల్లోనూ ఒకే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. కానీ రజినీకాంత్ ‘వేట్టయాన్’ మూవీ రిలీజ్ సందర్భంగా తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న కొన్ని ఇతర భాషల సినిమాలకు తెలుగులో టైటిల్ పెట్టట్లేదు అనే వివాదం నెలకొంది. ఇక ఈ టైటిల్ వివాదం వల్ల సినిమాపై గట్టి దెబ్బ పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ మూవీ టైటిల్ కోసం పడిన కష్టాన్ని వివరించారు.


‘గేమ్ ఛేంజర్’కు ఇన్ని కష్టాలా?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘వేట్టయాన్’ సినిమా వివాదం ఆ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ కు కారణమైంది. అయితే నిర్మాతలు దిగి వచ్చి తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నామని, కానీ టైటిల్ దొరకపోవడంతో పాన్ ఇండియా వైడ్ గా ఒకే టైటిల్ తో రిలీజ్ చేశామని వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత దిల్ రాజు  స్పందిస్తూ దేశవ్యాప్తంగా రిలీజ్ చేసే విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వివరించారు.


దిల్ రాజు మాట్లాడుతూ ‘పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఒకే టైటిల్ పెట్టాలని చాలామంది మేకర్స్ ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు అది సాధ్యం అయ్యే అవకాశం ఉండదు. ఒక్క భాషలో టైటిల్ దొరక్కపోయినా మిగతా భాషలలో టైటిల్ ను మార్చాల్సి వస్తుంది. డైరెక్టర్ శంకర్ ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ గురించి చెప్పినప్పుడు నేను అన్ని భాషల్లోనూ ట్రై చేశాను. కానీ ఒక్క భాషలో మాత్రం ఆ టైటిల్ దొరకలేదు. అప్పటికే వేరే వాళ్ళు అదే పేరుతో టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక టైటిల్ విషయమై వాళ్ళను ఒప్పించి ఆ తర్వాతే అఫీషియల్ గా టైటిల్ ను రిలీజ్ చేసాము. ఇలా సినిమా టైటిల్ కోసం మేకర్స్ పడే ఇబ్బందులు చాలానే ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులు కూడా టైటిల్ ను కాకుండా సినిమా కంటెంట్ ను పట్టించుకుంటే బాగుంటుంది’ అని దిల్ రాజు అన్నారు. మొత్తానికి దిల్ రాజు ఒక పాన్ ఇండియా సినిమా నిర్మాతగా టైటిల్ కష్టాలు ఎలా ఉంటాయో వివరించి , మిగతా భాషల్లో  ‘గేమ్ ఛేంజర్’కు అడ్డంకి ఎదురవ్వకుండా ముందు జాగ్రత్తగా క్లారిటీ ఇచ్చారు. కానీ లైకా ప్రొడక్షన్స్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది. ముందుగానే టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చి ఉంటే ‘వేట్టయాన్’కు ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు.

డిసెంబర్ లో ‘గేమ్ ఛేంజర్’ రాక

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ . ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×