UI Movie: కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90 వ దశకంలో ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా అని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ.. అప్పుడే ఉపేంద్ర సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్నీ అందుకున్నాయి. రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు సినిమాలతో అసలు ఇలాంటి కథలు తీయాలంటే ఉపేంద్ర తరువాతనే ఎవరైనా అని అనిపించుకున్నాడు.
విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. ఇప్పుడు స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ వద్ద జాతర వాతావరనమ్ కనిపించేది. పెద్ద పెద్ద కట్ అవుట్స్, పూలాభిషేకాలు.. పాలాభిషేకాలు.. హారతులు ఇవ్వడాలు.. అబ్బో మాములుగా ఉండేవి కాదు. తెలుగులో కూడా అప్పుడప్పుడు తన సత్తాను చాటుకున్నాడు ఉపేంద్ర. ఇక జనరేషన్ మారేకొద్దీ ఉపేంద్ర సినిమాలు తగ్గించేశాడు. హీరోగా కాకుండా కీలక పాత్రల్లో నటిస్తూ వచ్చాడు.
Koratala Shiva: రౌడీ హీరోతో సినిమా.. ఫిక్స్ అయితే మాస్ హిట్ గ్యారెంటీ..!
గత కొన్నేళ్లుగా సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి కేవలం హీరోగా మాత్రేమే సినిమాలు చేస్తూ వచ్చిన ఉపేంద్ర గతేడాది కబ్జా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఇంచు మించు కెజిఎఫ్ లా ఉండడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినా నిరాశపడకుండా ఉపేంద్ర తన బుర్రకు పదును పెట్టి.. తానే కథను రాసుకొని చాలా గ్యాప్ తరువాత యూఐ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు పెరుగుతూనే వచ్చాయి.
అసలు యూఐ అంటే ఏంటి . . ? ఉపేంద్ర ఎలాంటి కథతో వస్తున్నాడు.. ? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రోల్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డిసెంబరు 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఉపేంద్ర ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా అన్నిచోట్లకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయనకు తెలుగు అంటే ఎంతో అభిమానం.
Sankranthiki Vasthunam: మీనూ సాంగ్.. ఘర్షణ రామచంద్ర గుర్తొచ్చాడు బాసూ
కొన్నిరోజులుగా తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ లో ఎక్కడ చూసిన ఆయనే కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని, క్లైమాక్స్ సైతం చాలా కొత్తగా ఉంటుందని ఉపేంద్ర చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా బుకింగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ జనరేషన్ కు వింటేజ్ ఉపేంద్ర ఎలా ఉండేవాడో అనేది తెలియదు. ఈ సినిమాతో ఆ వింటేజ్ మ్యానియాను తెస్తాడేమో చూడాలి.