Sankranthiki Vastunnam: విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబో నుంచి వస్తున్న మూడో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకీ మామ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రతి సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమా కచ్చితంగా ఉంటుంది. అందులో అనిల్ రావిపూడి సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ఫిక్స్ అయ్యినట్లే. అందుకే అందరూ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రబృందం.. ఈ చిత్రం నుంచి గోదారి గట్టుపై రామచిలకవే.. గోరింటాకెట్టుకున్న చందమామవే అని సాగే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.
Netflix : ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోని నెట్ ఫ్లిక్స్! గట్టి ఝలక్ ఇచ్చిన DPA
రమణ గోగుల పాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎక్కడ చూసిన ఈ సాంగ్ నే వినిపిస్తుంది. ఇక ఈ సాంగ్ ను మించి తాజాగా మరొక సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మీనూ అంటూ సాగిన ఈ సాంగ్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి అనిల్ ఈ కథ ఒక ఎక్స్ కాప్.. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. ఒక ఎక్స్ లెంట్ వైఫ్ మధ్య జరుగుతుందని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సాంగ్ లో ఆ ముగ్గురిని చూపించారు. ఎక్స్ కాప్ గా వెంకీ మామ కనిపించగా.. ఎక్స్ లెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ కనిపించింది. ఇక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి కనిపించింది. ఈ సాంగ్ లో వెంకీ మామ తన భార్యకు తన లవ్ స్టోరీని చెప్తున్నట్లు చూపించారు.
Ghaati: పుష్పరాజ్ కు బిజినెస్ పార్నర్ దొరికిందోచ్… ‘ఘాటి’ లో అనుష్క రోల్ ఇదే?
ఇక లవ్ స్టోరీలో వెంకీ మామ కాప్ గా ఎంతో అద్భుతంగా ఉన్నాడు. వెంకీ కెరీర్ లోనే స్టైలిష్ కాప్ గా కనిపించిమెప్పించిన ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్రలా కనిపించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ వింటే.. ప్రతి ఒక్కరికీ తమ పాత లోవర్ గుర్తురాకుండా మానదు. ఇక భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య వాయిస్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.