BigTV English

Cannes Film Festival 2024: కేన్స్‌లో భారతీయ దర్శకురాలి ఘనత.. రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు కైవసం!

Cannes Film Festival 2024: కేన్స్‌లో భారతీయ దర్శకురాలి ఘనత.. రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు కైవసం!

Payal Kapadia Grand Prix Award at Cannes Film Festival 2024: 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజున జరిగిన అవార్డుల వేడుకలో భారతీయ చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చరిత్ర సృష్టించింది. మలయాళం-హిందీ భాషా చిత్రంగా దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించారు. ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అనేది ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘పామ్ డి ఓర్’ తర్వాత రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. దీంతో ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీకి గానూ పాయల్ కపాడియా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును అందుకుంది.


అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒక భారతీయ సినిమా ఇలాంటి ఘనత సాధించిందంటే అది మామూలు విషయం కాదు. మొదటిగా 1994లో షాజీ ఎన్ కరుణ్ మూవీ ‘స్వహం’ ‘పామ్ డి ఓర్’ కేటగిరీలో పోటీలో నిలిచింది. ఇప్పుడు ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీతో పాయల్ కపాడియా అరుదైన గ్రాండ్ పిక్సెల్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన తర్వాత.. ఈ చిత్రం ఎనిమిది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్‌ను అందుకుంది. తద్వారా అక్కడున్న వారితో చప్పట్లు కొట్టించింది. ఎంతోమంది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

అయితే అంతర్జాతీయ వేదికపై పాయల్ కపాడియాకు ఇది మొదటి బహుమతి కాదు. ఇది వరకు 2021లో ఆమె విమర్శకుల నుంచి ప్రశంసలు పొందిన డాక్యుమెంటరీ ‘A నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్‌లో ప్రదర్శించబడింది. అంతేకాకుండా అది Oeil d’Or (గోల్డెన్ ఐ) అవార్డును గెలుచుకుంది. అలాగే ఆమె షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్‌నూన్ క్లౌడ్స్’ కూడా సినీఫోండేషన్‌లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది.


Also Read: 30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో భారతీయ సినిమా.. చప్పట్లతో వెల్లువెత్తిన ప్రశంసలు.. డ్యాన్స్‌లతో హూరెత్తించిన మూవీ యూనిట్

అయితే పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కని కృతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృదయ హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీ కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ. కని కృతి పాత్ర పోషించిన నర్స్ ప్రభ కథకు ముఖ్యం. చాలా కాలంగా అణచివేయబడిన తన భావాలను తిరిగి మేల్కొల్పుతూ, విడిపోయిన భర్త నుండి ఆమె ఊహించని సమస్యలను అందుకున్నప్పుడు ఆమె ప్రపంచం గందరగోళంలో పడింది. అయితే ప్రభ తన గతంలోని ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆమె రూమ్‌మేట్ అను కొత్త ప్రేమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ముంబైలోని అస్తవ్యస్తమైన వీధుల నేపథ్యంలో అందంగా ఈ చిత్రం చిత్రీకరించబడింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×