BigTV English

Allu Arjun: మళ్లీ పెంట చేసిన బన్నీ.. బంధాలు కూడా గుర్తు రానంతగా..?

Allu Arjun: మళ్లీ పెంట చేసిన బన్నీ.. బంధాలు కూడా గుర్తు రానంతగా..?

Allu Arjun: ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో.. ఆ సమయంలో అల్లు అర్జున్(Allu Arjun).. తన మేనమామ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన తన స్నేహితుడికి సపోర్ట్ చేయడంతో అసలు గొడవ మొదలైంది. వాస్తవానికి సినీ రంగంలోని వాతావరణం కూడా ప్రస్తుతం అలాగే మారిపోయింది. అటు అల్లు అర్జున్, ఇటు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియదు కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ మధ్య విభేదాల స్థాయికి అవి ప్రాజెక్టు అయ్యాయి అని చెప్పవచ్చు.


పుష్ప 2 పై కూడా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..

ఇకపోతే పుష్ప -2 సినిమాకు టికెట్ రేట్లు అధికం కావడంతో.. దీనిని కారణంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పుష్ప -2 సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిపించారు. దాని ఫలితం కూడా వసూళ్లపై కనిపించింది. ఇకపోతే పుష్ప -2 సినిమా సినీ చరిత్ర ఎరుగని రికార్డులు సృష్టించిందని మేకర్స్ ఊదరగొడుతూ ఉంటే.. ఏపీలో మాత్రం కలెక్షన్స్ డల్ గా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో అల్లు అర్జున్ చేసిన కామెంట్లు అందరిలో సరికొత్త అనుమానాలు నింపుతున్నాయి.


ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పిన బన్నీ..

వాస్తవానికి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కారణంగానే ఈ స్టేజ్ లో ఉన్నారు అనేది వాస్తవం. కానీ ఆయన మాత్రం తన సొంత కాళ్ళ మీద ఈ స్టేజ్ కి వచ్చాను అని చెబుతున్నారు. ఇకపోతే మరొకవైపు ఈ సక్సెస్ కి కారణం మెగా అభిమానులు కూడా ఉన్నారని, కనీసం థాంక్స్ కూడా చెప్పకపోవడం వల్లే అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని నష్ట నివారణ కోసం సక్సెస్ మీట్ పేరిట ఒక మీటింగ్ పెట్టారని అందరూ కామెంట్లు చేస్తున్నారు . అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ కూడా తన నోరు తెరిచి ధన్యవాదాలు అనే పదాన్ని ఉచ్చరించారు. తెలంగాణ సీఎంకు, సినిమా ఆటోగ్రఫీ మంత్రికి థాంక్స్ చెప్పిన ఈయన అలాగే ఏపీ సీఎంకు, సినిమా ఆటోగ్రఫీ మంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని సంబోధించిన బన్నీ..

అంతేకాదు “ఈ స్పెషల్ ప్రైసెస్ రావడానికి ప్రధాన కారణం అయిన ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా థాంక్యూ సో మచ్ అని” ఎట్టకేలకు తన మామ పవన్ కళ్యాణ్ కి కూడా థాంక్స్ తెలిపారు అల్లు అర్జున్. అయితే ఈ విషయం చెప్పడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షద్వానాలతో మురిసిపోయారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసినదంతా మర్చిపోదాం అనుకునే లోపే సడన్ గా పవన్ పై మళ్లీ అల్లు అర్జున్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది.. అదేమిటంటే అల్లు అర్జున్ అక్కడితో ఆగకుండా “ఆన్ ఏ పర్సనల్ నోట్” అంటూ “పవన్ కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ వెరీ మచ్” అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. దీంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి బాబాయ్ ఎప్పుడు అయ్యారు..? ఆయన వరుసకు మామయ్య కదా అవుతారు? అని సినీ జనులంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. జనసైనికులు ఏపీలో పుష్ప -2 ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో నష్ట నివారణ కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాడని ,అంతేతప్ప తన మేనమామలను దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్లు చేయలేదని స్పష్టంగా తేటతెల్లమైందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బన్నీ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కళ్యాణ్ బాబాయి అని ప్రస్తావించడంతో సక్సెస్ ఇచ్చిన క్రేజ్ బంధాలను కూడా మరిచిపోయేలా చేసిందా అంటూ మళ్ళీ అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి దీనికి ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×