BigTV English

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

తరచుగా కొంత మంది పీడకలలో ఇబ్బందులు పడుతుంటారు. నిద్రలో కలవరపాటుకు గురవుతారు. ఎందుకు అలా అవుతుంది. నిద్రలో దెయ్యాల కలలు ఎందుకు వస్తాయి. మనం చేసే పనులు కలల మీద ఎఫెక్ట్ చూపిస్తాయా? లాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ చక్కటి నిద్ర వచ్చేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పడక గది ఎంత చక్కగా ఉంటే నిద్ర అంత బాగ పడుతుంది. చక్కటి పరుపు, మసక వెలుతురుతో ఉంటే మరీ మంచిది. ప్రశాంతమైన వాతావరణం మీ మనస్సును మరింత తేలికపరిచి చక్కగా నిద్రపోయేలా చేస్తుంది. నిద్రకు ముందు భయానక సినిమాలు చూడకూడదు. గగుర్పాటు కలిగించే కథలను చదవకూడదు. రాత్రిపూట కలవరపెట్టే వీడియోల జోలికి వెళ్లకూడదు. విశ్రాంతికరమైన వాతావరణాన్ని మృదువైన సంగీతాన్ని ప్లే చేయడం మంచిది.

⦿ ఒత్తిడి, ఆందోళనన లేకుండా చూసుకోండి!

పడుకునే ముందు ఒత్తిడి. ఆందోళన లేకుండా చూసుకోవాలి.  దీర్ఘ శ్వాస, ధ్యానం లాంటివి చేయాలి. అధిక ఒత్తిడి అనేది భయానక కలలకు దారితీస్తుంది. మనస్సును క్లియర్ గా ఉంచుకునేందుకు నిద్రపోయే ముందు చింతలు, భయాలు లేకుండా చూసుకోవాలి.  ఇలా చేయండి వల్ల కలలలోకి ఆందోళనకరమైన ఆలోచనలు రాకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. పడుకునే ముందు దెయ్యాల సంబంధిత విషయాల గురించి మాట్లాడుకోకపోవడం మంచిది.


⦿ డైలీ ఒకే నిద్ర పద్దతిని పాటించండి

మీ శరీరం స్లీపింగ్ సైకిల్ ను నియంత్రించడానికి ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని మేల్కోవాలి.ఇలా చేయడం వల్ల పీడకలలు తగ్గుతాయి. కెఫిన్, నికోటిన్, పడుకునే ముందు ఎక్కువగా తినడాన్ని అవాయిడ్ చేయాలి. ఇవన్నీ నిద్రకు ఇబ్బంది కలిగిస్తాయి. పగటిపూట శారీరక శ్రమ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి సంబంధిత కలలను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు, బీచ్, సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కలలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

⦿ నిద్ర అంతరాయాలను నివారించండి

నిద్రకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. కొన్ని రకాల మందులు పీడకలలకు కారణమవుతాయి. నిద్ర లేకపోవడం పీడకలలు వచ్చేందుకు మరింత కారణం అవుతుంది. రోజూ 7-9 గంటల నిద్రపోవడం మంచిది.

Read Also: గుండె సేఫ్ గా ఉండాలంటే ఎలా పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

⦿ దెయ్యాల కలలు ఎందుకు వస్తాయి?

తెలియని వాటి గురించి, మరణం గురించి ఆందోళనలు అనేవి కలలలో దెయ్యాలుగా వ్యక్తం అవుతాయి. కలలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు నిద్రలో తరచుగా పీడకలలు వస్తాయి. ఆ రోజు జరిగిన కొన్ని ఇబ్బందికర ఘటనలు కూడా రాత్రి నిద్రలో భయానక కలలు వచ్చేందుకు కారణం అవుతాయి.

Read Also:  వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Related News

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×