Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు అనే రియాలిటీ షో ఇప్పటికీ ఏడు సీజన్స్ పూర్తిచేసుకుంది. 8వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. 3వ సీజన్ నుండి ఈ షోకు నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన హోస్ట్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆయనపై ఏదో ఒక విధంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. హోస్టింగ్ అంటే ఇలా ఉండకూడదు అని, తప్పు చేసిన కంటెస్టెంట్స్‌ను గట్టిగా మందలించాలని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ నాగ్ అలా చేయరు. ప్రోమోల్లో చూపించినట్టుగా కంటెస్టెంట్స్‌పై నాగార్జున ఫైర్ అవ్వరు. ఇక తాజాగా ప్రసారమయిన వీకెండ్ ఎపిసోడ్‌లో ఆయన ఒక్క కంటెస్టెంట్‌నే టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడం అస్సలు బాలేదని ఆడియన్స్ ఫీలవుతున్నారు.
గౌతమ్‌కు చివాట్లు
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చాడు గౌతమ్. తను అప్పటికే హీరోగా ఒక సినిమా చేసినా కూడా అసలు గౌతమ్ అంటే ఎవరో చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అలాంటిది బిగ్ బాస్‌లోకి వచ్చి కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా ఎవరి విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా తన గేమ్‌పై తను దృష్టిపెట్టేవాడు గౌతమ్. అయినా కూడా తను చేసిన చిన్న తప్పును పెద్దగా చూపించి మందలిస్తూ ఉండేవారు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఏమీ మారలేదు. మళ్లీ మళ్లీ గౌతమే ఎందుకు టార్గెట్ అవుతున్నాడని తన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పైగా నాగ్ ప్రత్యేకంగా నిఖిల్, విష్ణుప్రియాకు చనువు ఇస్తున్నారని అనుకుంటున్నారు.
Also Read: ఎవరీ బిగ్ బాస్.. ఎలా ఉంటారో మీకు తెలుసా..?
ఎందుకీ తేడా?
గతవారం జరిగిన నామినేషన్స్‌లో నిఖిల్, గౌతమ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అందులో గౌతమ్.. యష్మీని వాడుకున్నావంటూ నిఖిల్‌పై నోరుజారాడు. తను అన్న మాట చాలా పెద్ద తప్పు అని చాలామంది ప్రేక్షకులు భావించారు. నాగార్జునకు కూడా అదే అనిపించింది. అందుకే గౌతమ్‌పై చాలా సీరియస్ అయ్యారు. తన తల్లి టీచర్ కాబట్టి దానికి సంబంధించిన ఉదాహరణ తీసుకొని, తను మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు. ఈ గొడవలో నిఖిల్‌ది కూడా తప్పు ఉంది. అయినా కూడా గౌతమ్‌పై సీరియస్ అయినంతగా నిఖిల్‌పై సీరియస్ అవ్వలేదు నాగ్. దీంతో నిఖిల్‌కు నాగార్జున సపోర్ట్ చేస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు.
సరదా మాటలు
ఇక బిగ్ బాస్ సీజన్ 8లో అసలు హోస్ట్ దగ్గర నుండి తిట్లు తినని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియా పేరే గుర్తొస్తుంది. కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి సరదాగా ఆడుతూ పాడుతూ కాలాన్ని గడిపేసింది విష్ణు. తను టాస్కులు ఆడకపోయినా, ఎలాంటి తప్పు చేసినా నాగ్ ఆ విషయాన్ని పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా పృథ్వితో కలిసి తన గేమ్‌ను పాడుచేసుకుంటుంది అన్నప్పుడు కూడా ఆ విషయంపై నాగార్జున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతే కాకుండా వారిద్దరూ ట్రాక్ గురించి సరదాగా మాట్లాడేవారు కూడా. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ 8లో ఉన్న కంటెస్టెంట్స్‌లో నిఖిల్, విష్ణుప్రియాకు నాగార్జున సపోర్ట్ అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.