BigTV English

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సూపర్‌ హీరో సినిమాలను దాదాపు అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటికి అతుక్కుపోతుంటారు. ఇక మార్వెల్ కామిక్స్ నుంచి సినిమా వచ్చిందంటే ఆగమన్నా ఆగరు. థియేటర్లకు పరుగులు పెడుతుంటారు. ఈ సినిమాలు ఓటీటీలోకి వచ్చినా కూడా మళ్ళీ, మళ్ళీ రిపీట్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక సూపర్‌ హీరో మూవీ, థియేటర్లలో విడుదలైన రెండు నెలల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. భూమిని అంతం చేయడానికి వచ్చిన ఒక సైతాన్ ని నలుగురు సూపర్ హీరోస్ తమ పవర్స్ తో ఫైట్ చేస్తారు. ఇక క్లైమాక్స్ వరకు ఈ హీరోలు చేసే విన్యాసాలకు ఆడియన్స్ కేరింతలు కొడతారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ 2025లో విడుదలైన హాలీవుడ్ సూపర్‌ హీరో మూవీ. మార్వెల్ కామిక్స్ సూపర్‌హీరో టీమ్ ఆధారంగా మాట్ షాక్‌మన్ డైరెక్ట్ చేసిన చిత్రంలో పెడ్రో పాస్కల్ (రీడ్ రిచర్డ్స్/మిస్టర్ ఫాంటాస్టిక్), వనెస్సా కిర్బీ (సూ స్టార్మ్/ఇన్విజిబుల్ వుమన్), జోసెఫ్ క్విన్ (జానీ స్టార్మ్/హ్యూమన్ టార్చ్), ఎబన్ మాస్-బక్రాచ్ (బెన్ గ్రిమ్/ది థింగ్) ప్రధాన పాత్రల్లో నటించారు. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్‌పై కెవిన్ ఫీజీ నిర్మించిన ఈ సినిమా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో ఫేజ్ 6 లో మొదటి చిత్రం. ఈ సినిమా 2025 జూలై 25న థియేటర్లలో విడుదలై, సెప్టెంబర్ 23, 2025 నుంచి ఆపిల్ టీవీ+, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇది ఇంగ్లిష్ ఒరిజినల్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ డబ్బింగ్‌లతో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ 1964లో ఎర్త్-828 ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో జరుగుతుంది. రీడ్ రిచర్డ్స్, సూ స్టార్మ్, జానీ స్టార్మ్, బెన్ గ్రిమ్ ఒక ప్రయోగాత్మక అంతరిక్ష మిషన్‌లో సూపర్‌పవర్స్ పొంది ఫెంటాస్టిక్ ఫోర్‌గా స్థిరపడ్డారు. వీళ్ళు న్యూయార్క్‌లోని బాక్స్టర్ బిల్డింగ్ నుండి ఆపరేట్ చేస్తూ, ఈ యూనివర్స్‌లో ఏకైక సూపర్‌హీరోలుగా తమ సేవలు అందిస్తుంటారు. రీడ్, సూ వివాహం చేసుకుని తమకు పుట్టబోయే బిడ్డకోసం ఎదురు చూస్తుంటారు. జానీ ఫైరీ పర్సనాలిటీ, బెన్ సూపర్ పవర్ ఇప్పుడు టీమ్‌కు సప్పోర్ట్ గా ఉంటాయి. గలాక్టస్ అనే గ్రహాలను నాశనం చేసే ఒక రాక్షసుడు, ఇప్పుడు భూమిని టార్గెట్ చేస్తాడు. అతని అనుచరురాలు షల్లా ఫెంటాస్టిక్ ఫోర్‌ను హెచ్చరించడానికి ఎర్త్‌కు వస్తుంది. షల్లా తప్పని పరిస్థితిలో, గలాక్టస్ కోసం పని చేస్తున్నట్లు చెబుతుంది. అయితే రీడ్, సూ కుమారుడు ఫ్రాంక్లిన్ పవర్స్ గలాక్టస్ ని భయపెడతాయి. అందువల్ల గలాక్టస్ గర్భంలో ఉన్న ఫ్రాంక్లిన్ ను అంతం చేయాలని చూస్తాడు.


ఎర్త్‌ను రక్షించడానికి ఫ్రాంక్లిన్‌ను త్యాగం చేయమని పబ్లిక్ వీళ్ళ పై ఒత్తిడి చేస్తుంది. ఇది టీమ్‌లో ఒక ఎమోషనల్ ఫీల్ ని సృష్టిస్తుంది. ఈ సమయంలో సూ ఒక శక్తివంతమైన స్పీచ్ ఇస్తుంది. మానవజాతిని, తన కొడుకును రక్షించడానికి టీమ్ సంకల్పంతో ఉందని నొక్కిచెప్పుతుంది. రీడ్ ఒక శాస్త్రవేత్తగా, గలాక్టస్‌ను ఒక పోర్టల్‌లో బంధించే ప్లాన్‌ను రూపొందిస్తాడు. క్లైమాక్స్ మేజర్ ఒక ట్విస్ట్ వస్తుంది. ఫెంటాస్టిక్ ఫోర్ ప్లాన్ గలాక్టస్‌ను పోర్టల్‌లో బంధించడానికి వేసిన ప్లాన్ బెడిసికొడుతుంది. ఎందుకంటే గలాక్టస్ శక్తి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఒక మేజర్ ట్విస్ట్‌లో, షల్లా గలాక్టస్‌కు వ్యతిరేకంగా తిరగబడుతుంది. తన గ్రహం నాశనాన్ని చూసిన తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. ఆమె ఫెంటాస్టిక్ ఫోర్‌తో కలిసి గలాక్టస్‌ను ఒక బ్లాక్ హోల్‌లోకి లాగే ప్లాన్‌లో సహాయం చేస్తుంది. కానీ ఈ ప్రక్రియలో ఆమె తన శక్తులను కోల్పోతుంది. గలాక్టస్‌ను ఓడించడానికి ఫెంటాస్టిక్ ఫోర్ తమ శక్తులను కలిపి ఉపయోగిస్తారు. చివరికి గలాక్టస్‌ను ఫెంటాస్టిక్ ఫోర్ ఓడిస్తారా ? భూమిని కాపాడతారా ? అనే విషయాలను, ఈ సూపర్‌ హీరో సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

Related News

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

Big Stories

×