Allu Arjun case: హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరిని ఆశ్చర్య పరుస్తోంది.. అయితే ఈ ఘటన ఇప్పుడు బన్నీ మెడకు ఉచ్చు బిగించేలా కనిపిస్తోందనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయి, 14 రోజులపాటు రిమాండ్ లో ఉండాల్సి ఉండగా.. హైకోర్టు నుండి క్యాష్ పిటిషన్ తో మద్యంతర బెయిల్ అందుకున్నారు. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం గత కొద్ది రోజులుగా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేస్తుండగా.. ఇక నిన్నటి విచారణలో షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది నాంపల్లి కోర్టు.
షరతులతో కూడిన బెయిల్ మంజూరు..
నిన్న జరిగిన విచారణలో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కానీ, రూ.50 వేల సొంత పూచీకత్తు పై బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అని, పోలీసులు పెట్టిన మిగతా కండిషన్స్ ని కూడా అల్లు అర్జున్ ఫాలో అవ్వాలని కూడా కోర్టు చెప్పింది. ఇకపోతే శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్లేందుకు కోర్టు ఎటువంటి అడ్డంకులు చెప్పలేదని కూడా గుర్తు చేసింది. పోలీసులు తదుపరి విచారణకు కూడా అల్లు అర్జున్ సహకరించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడకూడదని, పోలీసులు ఏ టైంలో పిలిచి ఆ అల్లు అర్జున్ విచారణకు రావాలి అని, అలాగే మరిన్ని సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుందని, నోటీసులు ఎప్పుడైనా రావచ్చని కూడా అల్లు అర్జున్ న్యాయవాదితో నాంపల్లి కోర్టు తెలిపింది.
నాంపల్లి కోర్టుకు వెళ్ళనున్న అల్లు అర్జున్..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరి కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లి బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను సమర్పించనున్నారు. ఈరోజు శనివారం కాబట్టి మధ్యాహ్నం లంచ్ సమయంలోపే కోర్టుకి వెళ్ళనున్నారు. ఇక అందులో భాగంగానే రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన 50 వేల రూపాయల రెండు షూరిటీలను సమర్పించాలని కోర్టు చెప్పడంతో, ఇప్పుడు పూచీకత్తు పత్రాలు సమర్పించడానికి వెళ్తున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి అల్లు అర్జున్ స్వయంగా సమర్పించనున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ అయితే లభించింది కానీ పూర్తి ఉపశమనం మాత్రం లభించలేదు అని చెప్పవచ్చు.
పుష్ప 2 సినిమా విశేషాలు..
ఇక అల్లు అర్జున్, సుకుమార్ (Sukumar)కాంబినేషన్లో రష్మిక మందన్న (Rashmika Mandanna)హీరోయిన్గా వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. విజయం అయితే అందుకుంది కానీ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కొడుకు హాస్పిటల్ పాలవడంతో అల్లు అర్జున్ కి అసలు చిక్కు ఎదురైందని చెప్పవచ్చు.