Medchal Boys Hostel Incident: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో తెల్లవారు జామున దారుణ హత్య జరిగింది. మల్లికార్జున్ కాలనీలో అనురాగ్ రెడ్డి హాస్టల్‌లో కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని పద్మ, మహేందర్ రెడ్డి అనే ఇద్దరు హత్య చేశారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా మల్లికార్జున నగర్‌లోని అనురాగ్‌రెడ్డి బాయ్స్ హాస్టల్‌లో దారుణహత్య జరిగింది. మహేందర్ రెడ్డి అనే క్యాబ్ డ్రైవర్‌ను వంట వన్డే గంటేలతో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు కిరణ్ రెడ్డి అనే వ్యక్తి. గతంలో సూర్యాపేట జిల్లా మిర్యాలగూడెం కి చెందిన కిరణ్ రెడ్డి, జనగాం కి చెందిన మహేందర్ రెడ్డి ఇద్దరు స్నేహితులని తెలుస్తోంది. వీరిద్దరు ఒకే హాస్టల్‌లో ఉంటూ క్యాబ్ నడిపేవారు. అయితే ఓ మహిళ విషయంలో ఇద్దరు గొడవపడటమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మహేందర్ రెడ్డి కుటుంబ నేపథ్యం కూడా పేద కుటుంబం. అధేవిధంగా తనకు తల్లి కానీ ఎవరు లేరు. కేవలం వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, తననే నమ్ముకుని ఉన్న సిస్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మహేందర్ రెడ్డి గత కొన్ని రోజులుగా హాస్టల్‌కు దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడైతే పద్మ, కిరణ్ రెడ్డి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలిసిందో.. అప్పటి నుంచి తనతో మాట్లాడటం, చిన్న గొడవులు అవడం, మహేందర్ రెడ్డి దూరంగా ఉండటం జరిగింది. ఆ తర్వాత శనివారం ఉదయం కిరణ్ రెడ్డి, పద్మ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి, హాస్టల్‌కి మహేందర్ రెడ్డిని పిలిచి తెల్లవారుజామున హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు విచారణ కంటిన్యూ అవుతుంది.
Also Read: ప్రేమ పెళ్లి చిచ్చు.. పరస్పర దాడులు, కార్లు ధ్వంసం, ఇంతకీ ఎక్కడ?
మరోవైపు..హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో దారుణహత్య జరిగింది. రామంతపూర్ లోని కేసీఆర్ నగర్‌లో మహమ్మద్ నభి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. కత్తితో పొడిచి, బండరాయితో దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో నబి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే నబిని పాత నేరస్థుడిగా గుర్తించారు పోలీసులు. గతంలో జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి మర్డర్ కేసులో ప్రధాన నేరస్థుడిగా ఉన్నాడు. జైలు శిక్ష అనుభవించిన నబి.. రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. నబిని హత్య చేసింది జాకీర్ హుస్సేన్‌కు సంబంధించిన వారే అని అనుమానాలున్నాయి.