BigTV English

Pushpa 2 Second Single: “సూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామీ”.. సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది మావ.. ఇక డ్యాన్సులే!

Pushpa 2 Second Single: “సూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామీ”.. సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది మావ.. ఇక డ్యాన్సులే!

Pushpa 2 Second Single ‘Sooseki’ Releasing on May 29th: ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’. ఇప్పుడంతా ఈ మూవీపైనే కళ్లు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ‘పుష్ప’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యావత్ ప్రపంచ సినీ ప్రియుల్ని సైతం ఫిదా చేసింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.


ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కకపోయినా.. అదే రేంజ్‌లో హిట్ అయింది. అంతేకాకుండా ఈ మూవీతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది ఈ చిత్రం. బాక్సాఫీసు వద్ద కూడా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌ని మేకర్స్ ప్రకటించేశారు. ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్‌తో సెకండ్ పార్ట్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్‌కి కూడా కాస్త పనిభారం ఎక్కువైంది.

మరి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించాలంటే ఆ మాత్రం ఉంటుంది. అంతేకాకుండా ప్రేక్షకాభిమానుల అంచనాలను కూడా రీచ్ అవ్వాలి. అందువల్లనే సుకుమార్ చాలా జాగ్రత్తగా.. క్వాలిటీలో ఎలాంటి రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌, ఫస్ట్ సాంగ్‌కు అందరి నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.


Also Read: ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. రేపు ఉదయం 11 గంటలకు గెట్ రెడీ

అయితే తాజాగా ఈ మూవీలోని సెకండ్ సింగిల్‌ సర్ప్రైజ్ అందించారు. ఈ సెకండ్ సింగిల్‌కు సంబంధించి గత రెండు రోజులుగా అప్డేట్‌లు ఇస్తూనే ఉన్నారు మేకర్స్. మొత్తానికి ఇవాళ ఈ రెండో సాంగ్ ట్రీట్ అందించారు. ఈ మేరకు రష్మిక ఆ సాంగ్‌ అప్డేట్‌ను అందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో కేశవ ‘‘ఓ శ్రీవల్లి వదినా.. పుష్ప 2 నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తా ఉండారంట కదా.. ఆ పాటేందో సెప్తావా’’ అంటూ అడగ్గా.. రష్మిక క్యూట్ లుక్‌లో అందమైన స్టెప్పులతో ఆ సాంగ్ చెప్పేసింది. ‘‘ సూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామీ’’ అంటూ ఈ మూవీలోని సెకండ్ సాంగ్ సాగుతుందని తెలిపింది. ఈ మేరకు ఈ సాంగ్‌ను మే 29న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×