BigTV English

Hooded Pitohui: ఈ పక్షిని తాకితే ప్రాణం పోవడం ఖాయం.. నాగుపాముకన్నా ప్రమాదకరమైనది!

Hooded Pitohui: ఈ పక్షిని తాకితే ప్రాణం పోవడం ఖాయం.. నాగుపాముకన్నా ప్రమాదకరమైనది!

Most Venomous Bird in the World: సాధారణంగా పక్షులు రంగు రంగులుగా.. చాలా అందంగా.. ముద్దు ముద్దుగా ఉంటాయి. వాటితో ఎవరికీ ఎలాంటి ఆపద ఉండదు. వాటిని చూడగానే ఆడుకోవాలనిపిస్తుంది. అయితే ఇక్కడ ఓ పక్షి మాత్రం అన్ని పక్షుల కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ పక్షిని ముట్టుకుంటే క్షణాల్లో పక్షవాతం గానీ గుండెపోటు గాని లేదా చనిపోయే ప్రమాదం ఉంది.


అవును మీరు విన్నది నిజమే. ఆ పక్షి పేరు హుడెడ్ పిటోహుయ్. ఇది చూడటానికి చాలా అందంగా.. అమాయకంగా కనిపిస్తుంది. కానీ దీనిలో నాగుపాము విషంతో సమానమైన పాయిజన్ ఉంటుందట. పొరపాటున దీని రెక్కలను తాకితే.. కొన్ని నిమిషాల్లోనే ప్రణాలు పోయే ప్రమాదం సంభవిస్తుంది.

అయితే ఈ పక్షి ఎక్కువగా పాపువా న్యూ గినియాలో కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ఈ పక్షిని చెత్త పక్షి అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచలోనే అత్యంత విషపూరితమైనదిగా పేరు గాంచింది. ఈ పక్షి అత్యంత విషపూరితమైనదని 1990లో కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పర్యావరణ శాస్త్రవేత్త జాక్ డంబాచెర్ మొట్ట మొదటిసారిగా గుర్తించారు.


Also Read: మొసలి కంటపడిన పాము.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే షాక్!

జాక్.. ఈ పక్షిని అధ్యయనం చేస్తున్న సమయంలో.. వలలోంచి దీన్ని తీస్తున్నాడు. అప్పుడు అతడి చేతికి గాయమైంది. దీంతో కొన్ని నిమిషాల్లో అతడి చేయి మొద్దుబారిపోయింది. ఏం చేయాలో తెలియక అతడు.. తన చేయిని నోట్లో పెట్టుకున్నాడు. దీంతో మరికొన్ని సెకన్ల తర్వాత అతడి పెదాలు, నాలుక మండిపోయాయి. ఆపై అతడు మూర్చపోయాడు.

ఆ తర్వాత అతడు దీన్ని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షిగా గుర్తించాడు. దీని తర్వాత అతడు పిటోహుయ్ కణజాలంతో విషపూరితమైన రసాయనాలు ఏవి ఉన్నాయో పరిశీలించాడు. అనంతరం రెండేళ్ల పరిశోధన తర్వాత అతడి రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పక్షిలో ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన న్యూరోటాక్సిన్ అయిన బాట్రాకోటాక్సిన్ ఉందని అతడు నిర్దారించాడు.

Also Read: దేవుడా.. ఇది కాటేస్తే స్వర్గానికో.. నరకానికో పోవడం పక్కా..

ఇది ఆ పక్షి కణజాలం, ఈకలు, చర్మంలో ఉంటుందని తెలిపాడు. ఈ న్యూరోటాక్సిన్ నాగుపాములలో కూడా ఉంటుందని.. ఇది కొన్ని సెకన్లలో మనిషిని చంపేయగలదని చెప్పాడు. అయితే ఈ పక్షిలో కనిపించే టాక్సిన్.. గోల్డెన్ డార్ట్ కప్పల్లో కూడా కనిపిస్తుందట. ఈ కప్ప కూడా చాలా ప్రమాదరమైనది. ఇది ఒక వయోజన ఏనుగును కూడా కొన్ని సెకన్లలో మట్టుబెట్టగలదు.

శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ పక్షి స్వయంగా ఈ విషాన్ని ఉత్పత్తి చేయలేదు. ఇది ఎక్కువగా బీటిల్స్‌ను తింటుంది. వీటిని మలేరియా బీటిల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి కూడా. వీటిని తినే సమయంలోనే ప్రమాదకరమైన న్యూరోటాక్సిన్‌ ఈ పక్షిలోకి బదిలీ చేయబడుతుందని వారు తెలిపారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×