BigTV English
Advertisement

Allu Arjun Army: అభిమానుల‌కు అల్లు అర్జున్ షాక్‌.. ఏడుస్తున్న ఫ్యాన్స్‌

Allu Arjun Army: అభిమానుల‌కు అల్లు అర్జున్ షాక్‌.. ఏడుస్తున్న ఫ్యాన్స్‌

Allu Arjun Army:నా ఆర్మీ అంటూ ఎప్పుడూ గ‌ట్టిగానే స్టేజ్‌ల‌పై త‌న అభిమానుల గురించి గొప్ప‌గా మాట్లాడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వారికి అనుకోని షాకిచ్చారు. ఇంత‌కీ అభిమానుల‌కు బ‌న్నీ ఎందుకు జ‌ల‌క్ ఇచ్చారు. దాని వెనుక ఏం జ‌రిగింది? అనే వివ‌రాల్లోకి వెళితే, అల్లు అర్జున్ ప్ర‌స్తుతం వైజాగ్‌లో ఉన్నారు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న పుష్ప 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతుంది. షూటింగ్ గ్యాప్‌లో అభిమానుల కోసం బ‌న్నీ ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. అదేంటంటే అభిమానులతో ఫొటో సెష‌న్‌. దానికి త‌గ్గ ఏర్పాటు కూడా జరిగాయి.


బ‌న్నీతో ఫొటో సెష‌న్ కావ‌టంతో అభిమానులు భారీగానే త‌ర‌లి వ‌చ్చారు. అయితే క్రౌడ్ మరీ ఎక్కువ కావ‌టంతో తోపులాట జ‌రిగింది. దీంతో మ‌న హీరోగారికి కోప‌మొచ్చింది. వెంట‌నే ఫొటో సెష‌న్‌ను క్యాన్సిల్ చేసి వెళ్లిపోయారు. అల్లు అర్జున్‌తో ఫొటో దిగాల‌ని వెయిట్ చేస్తున్న అభిమానులు ఆయ‌న వెళ్లిపోయార‌ని తెలియగానే చెప్ప‌లేని బాధ వేసింది. కొంద‌రైతే క‌న్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఇక పుష్ప 2 సినిమా విషయానికి వ‌స్తే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. పుష్ప ది రైజ్ చిత్రానికి కొన‌సాగింపుగా వ‌స్తున్న మూవీ ఇది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ ఏడాది చివ‌ర‌లో లేదా వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేసులో పుష్ప 2 వ‌స్తుంద‌ని టాక్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కుతుందనే సంగతి అందరికీ తెలసిందే. పార్ట్ 1 రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటడంతో ఇప్పుడు పుష్ప 2 ది రూల్‌పై భారీ అంచనాలున్నాయి. మేకర్స్ ముత్తం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ అంచనాలకు తగ్గట్టే సినిమాను నిర్మిస్తున్నారు.


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×