BigTV English

Fiber Labels:దుస్తులపై కంటికి కనిపించని లేబుల్.. ఎందుకంటే..

Fiber Labels:దుస్తులపై కంటికి కనిపించని లేబుల్.. ఎందుకంటే..

Fiber Labels:బట్టలు, దుస్తులు లాంటివి ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ జరుగుతాయి. కానీ 92 మిలియన్ టన్నుల బట్టలలో 15 శాతం బట్టలు కేవలం పాక్షికంగా మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయి. దానికి కారణం వాటి ఫ్యాబ్రిక్. అన్ని రకాల ఫ్యాబ్రిక్‌లను రీసైక్లింగ్ చేయడం కుదరదు. కానీ తాజాగా పరిశోధకులు కనుగొన్న ఓ కొత్త టెక్నిక్ ద్వారా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయిన రీసైకిల్ చేయవచ్చని వారు చెప్తున్నారు.


ఫ్యాబ్రిక్‌పై లేబుల్స్ లాంటివి అల్లడం ద్వారా అవి రీసైక్లింగ్‌కు పనికొస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రక్రియలో ముందుగా బార్‌‌కోడ్ లాగా ఉండే లేబుల్స్‌ను బట్టలపై అల్లుతారు. అవి ఫోటోనిక్ ఫైబర్స్‌తో తయారు చేస్తారు. ఈ లేబుల్స్ అనేవి కంటికి కనిపించేవిగా ఉంటాయి కానీ ఇన్‌ఫ్రా రెడ్ లైట్ సాయంతో మాత్రమే చదవవచ్చని వారు చెప్తున్నారు. ఇవి మామూలుగా ట్యాగ్స్‌కు, లేబుల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయని సమాచారం.

మామూలుగా ట్యాగ్స్ అనేవి బట్టలను ఉతికినప్పుడు లేదా చిరిగినప్పుడు పోతాయి. దాంతో ఆ ట్యాగ్‌లో ఉన్న సమాచారం కూడా పోతుంది. దాని వల్ల రీసైక్లింగ్ విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ ఫోటోనిక్ ఫైబర్‌తో ట్యాగ్‌ను తయారు చేయడం వల్ల బట్ట చిరిగిపోయినా.. అందులోని సమాచారం చదవవచ్చు. అందుకోసమే ఈ ఫైబర్‌పై మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నో రీసైక్లింగ్ విధానాల్లో ఇన్‌ఫ్రా రెడ్ లైటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. త్వరలోనే బట్టల రీసైక్లింగ్ విధానంలో కూడా ఈ టెక్నిక్ ప్రారంభం కానుంది.


ప్రస్తుతం దేశంలో ఎక్కువగా కాటన్ రీసైక్లర్స్‌ను ఉపయోగిస్తున్నారు. అంటే 70 శాతం పాలిస్టర్ బట్టలను ఇది రీసైకిల్ చేయడం కష్టం. అందుకే రీసైకిల్ చేయడం కంటే ముందు ఆ బట్ట ఎలాంటిదో తెలుసుకోవడం ముఖ్యం. అందుకే మామూలు ట్యాగ్స్‌ పూర్తిగా ఫ్యాబ్రిక్ గురించి సమాచారాన్ని అందించలేవు. కానీ ఫాటోనిక్ ఫైబర్ అందించగలవు. భారీ ప్రొడక్షన్ సమయంలో కూడా ఈ ఫోటోనిక్ ఫైబర్ ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ విభాగంలో మరిన్ని పరిశోధనలు చేయడానికి నేషనల్ సైన్స్ ఫౌండేషన్, అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ సహాయాన్ని అందించనున్నాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×