Allu Arjun Arrest : సంధ్య థియేటర్ దగ్గర ఘటన కారణంగా అల్లు అర్జున్‌పై 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసుతో పాటు మరి కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు అవ్వడంతో తాజా ఈ రోజు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు చిక్కడి పల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన చిక్కడి పల్లి పోలీసులు, కోర్టులో హాజరు పర్చడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు చేయబోతున్నారు. అందుకోసం అల్లు అర్జును చిక్కడి పల్లి పోలీస్ స్టేషన్ కు దగ్గరలో ఉన్న గాంధీ ఆస్పత్రికి పోలీసు అధికారులు తరలించబోతున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం నేరుగా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
చిరంజీవిని అడ్డుకున్న పోలీసులు..
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో మెగాస్టార్ చిరంజీవి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు స్టార్ట్ అయ్యారు. అయితే చిరంజీవి పోలీస్ స్టేషన్ కి వస్తే లా అండ్ అర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని పోలీసులు రావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారని సమాచారం.