Allu Arjun Arrest: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మెగాస్టార్ చిరంజీవి శాసిస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు 12 మందికి పైగా మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సాధించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకునే స్థాయికి వచ్చాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ సినిమాలు యాక్టింగ్ విషయంలో ఎటువంటి కంప్లైంట్ లేదు. కానీ అల్లు అర్జున్ రియల్ లైఫ్ విషనికి వస్తే చాలా వివాదాలు కంప్లైంట్స్ ఉన్నాయి.
తను కెరియర్లో ఎదగడానికి సహాయపడిన మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ మర్చిపోయాడు అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. అలానే పవన్ కళ్యాణ్ వ్యతిరేక పార్టీకి సపోర్ట్ కూడా అందించాడు అల్లు అర్జున్ ఇలాంటి విషయాలన్నీ మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి మధ్య వివాదాన్ని తీసుకొచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే రీసెంట్ గా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. అల్లు అర్జున్ ను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ తరుణంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు మెగాస్టార్ చిరంజీవి బయలుదేరి వెళుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ వద్దకు నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.
Also Read : Allu Arjun Arrest : మూడు రోజుల పాటు జైల్‌లోనే… అల్లు అర్జున్‌కు బెయిల్ కష్టాలు
ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి పైన ప్రశంసలు మొదలయ్యాయి. ఎవరైనా కష్టంలో ఉంటే మెగాస్టార్ కనికరించి తక్కును ముందు నిలిచి ఉంటారు అని చాలామంది ఎలివేషన్ పోస్టులు వేస్తున్నారు. ఇన్ని రోజులు అల్లు అర్జున్ కామెంట్స్ ని మెగాస్టార్ పట్టించుకోకుండా మొదటిసారి అల్లు అర్జున్ కోసం పోలీస్ స్టేషన్ కి మెగాస్టార్ చిరంజీవి వెళ్తున్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి అసలు క్యారెక్టర్ అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూ ని మెగాస్టార్ చిరంజీవి ఎలా డీల్ చేస్తారు. అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ కూడా ఉంది. రీసెంట్ గానే అల్లు అర్జున్ మొన్న ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ కల్యాణ బాబాయ్ థాంక్యూ అంటూ కూడా చెప్పారు. ఇక్కడితో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శాంతించారు.
Also Read : Bachhala Malli movie Trailer : అల్లరి నరేష్ బచ్చలపల్లి ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్