ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరో బిగ్ స్టెప్ వేయబోతున్నాడు. పుష్ప 2 తర్వాత అతను ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడో అనే విషయంలో ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మైథలాజికల్ సినిమా చేయాల్సి ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం పడేలా ఉన్నాయి. దీంతో, బన్నీ తన తదుపరి సినిమాను బిగ్ డైరెక్టర్ అట్లీతో లైన్‌లో పెట్టేశాడు!
ఇప్పటికే అట్లీ టీమ్ స్క్రిప్ట్ వర్క్ దుబాయ్‌లో జరుపుకుంటోంది. దుబాయ్ వేదికగా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. బన్నీ కూడా దుబాయ్ టూ హైదరాబాద్ ట్రిప్స్ కొనసాగిస్తున్నాడు. అంతేకాదు, బన్నీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కోసం విదేశాలకు వెళ్లి వచ్చాడని టాక్. మరి, ఈ ప్రాజెక్ట్ అధికారిక అనౌన్స్మెంట్ ఎప్పుడవుతుంది? సినిమా అనౌన్స్మెంట్ కి ఉగాది (ఏప్రిల్ 9) కి మించిన మంచి పర్వదినం లేదు. అదే రోజున బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ లాంచ్ అవ్వవచ్చని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఉగాది రోజున ప్రకటన రాకపోతే, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా భారీ అప్డేట్ రావడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను అట్లీ తన కెరీర్‌లోనే మైలురాయి చిత్రంగా ప్లాన్ చేస్తున్నాడని టాక్. బిగ్ బడ్జెట్, హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ – అన్నీ మిక్స్ చేసి ఓ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్‌లు ఉండబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దేవర బ్యూటీ జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించనుందట. మిగతా నాయికలుగా ఇతర బిగ్ నేమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, అట్లీ మూవీ కోసం తన లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు టాక్. ముఖ్యంగా అట్లీ మార్క్ మాస్ యాక్షన్ మరియు ఎమోషనల్ కంటెంట్ కలిపి ఉండేలా స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. అట్లీ గతంలో బిగిల్, జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తన మార్క్ చూపించాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి పాన్ ఇండియా స్కేల్‌లో మరో భారీ సినిమా తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమా ప్రకటన కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాది లేదా ఏప్రిల్ 8న అధికారిక అప్డేట్ వస్తే, అల్లు అర్జున్ కెరీర్‌లో మరో పెద్ద బాక్సాఫీస్ సెన్సేషన్ కి కౌంట్‌డౌన్ మొదలైనట్టే! మరి, ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఏ రేంజులో వస్తుంది? వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.