Allu Arjun- Atlee : “పుష్ప 2: ది రూల్” సినిమాతో భారతీయ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్, తన తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం పలు దర్శకులతో చర్చలు జరుపుతునే ఉన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం, అటు నార్త్ ఆడియెన్స్, ఇటు సౌత్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తునే ఉన్నారు. అయితే.. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాల్సిన అల్లు అర్జున్.. దాన్ని ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టి కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అట్లీ, “జవాన్” వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో పాన్-ఇండియా హిట్ కొట్టాడం, పుష్పరాజ్ క్రియేట్ చేసిన సెన్సేషన్‌కు.. ఈ క్రేజీ కాంబో అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ. ఫైనల్‌గా ఇప్పుడా సమయం రానే వచ్చేసింది.
హైప్ ఎక్కిస్తున్న సన్ పిక్చర్స్
బన్నీ-అట్లీ కలయికలో సినిమా కోసం చాలా కాలంగా అంతా ఎదురు చూస్తుండగా.. కనీసం ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటికి రాలేదు. కానీ లీకులు మాత్రం ఓ రేంజ్‌లో హైప్ ఇస్తున్నాయి. ఇక ఫైనల్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై హింట్ ఇచ్చేసినట్టే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా అట్లీ, బన్నీ సినిమా అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా టాక్ ఉంది. ఈ నేపథ్యంలో.. సన్ పిక్చర్స్ చేసిన లేటెస్ట్ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అతి త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది. మాస్‌ని మ్యాజిక్ మీట్ అయితే ఎలా ఉంటుందో చూస్తారు.. అన్నట్టుగా ముందు ఒక పోస్ట్ చేశారు. ఇక ఇపుడు మాగ్నమ్ ఓపస్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా మరో పోస్ట్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు మాగ్నమ్ ఓపస్ అప్డేట్ రాబోతున్నట్టుగా ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే.. ఈ పోస్టుల్లో ఎక్కడా కూడా ఇది అల్లు అర్జున్, అట్లీ సినిమా అనే హింట్ ఇవ్వలేదు. కానీ టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం.. ఇది అట్లీ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ గురించేనని అంతా భావిస్తున్నారు.
ఇంతకీ.. బన్నీ-అట్లీ సినిమానేనా?
వాస్తవానికైతే.. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని మొదట్లో చెప్పబడినప్పటికీ, బడ్జెట్ సమస్యల కారణంగా వారు తప్పుకున్నారని మధ్యలో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. దిల్ రాజు లేదా మైత్రీ మూవీ మేకర్స్ వంటి టాలీవుడ్ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఫైనల్‌గా అధికారిక ప్రకటన రానప్పటికీ.. సన్ పిక్చర్స్ సంస్థనే ఈ సినిమా నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సన్ సంస్థ వారు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. అట్లీకే వంద కోట్ల పారితోషికం ఇస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. బన్నీకి దీనికి డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టుగా టాక్. ఇక హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అట్లీ ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఒక స్పెషల్ వీడియో కూడా రెడీ చేసినట్టుగా చెబుతున్నారు. ఇంతకీ.. సన్ పిక్చర్స్ ఇస్తున్న హింట్స్ బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ గురించేనా?