BEL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 9న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు.
ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో ఐడీబీఐలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. లక్షల్లో జీతాలు భయ్యా..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 32
హైదరాబాద్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు రకాల పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ఈఏటీ), టెక్నీషియన్ సీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు – ఖాళీలు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ(ఈఏటీ): 08
టెక్నీషియన్ సీ: 21
జూనియర్ అసిస్టెంట్: 03
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 9
వయస్సు: 2025 మార్చి 1 నాటికి 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్‌కు రూ.21,500 – రూ.82,000, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి రూ.24,500 – రూ.90,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్‌కు రూ.21,500 – రూ.82,000, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి రూ.24,500 – రూ.90,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 32
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 9
నోట్: దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. సొంత రాష్ట్రంలో ఉద్యోగం ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదు.
ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!